ఖమ్మం, నవంబర్ 28 (విజయక్రాంతి): బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం ఖమ్మంలో దీక్షా దివస్ నిర్వహిస్తున్నట్లు పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ప్రకటించారు. గురువారం జిల్లాకేంద్రంలోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తామన్నారు. అన్నదాన కార్యక్రమం ఉంటుందని చెప్పారు.
తెలంగాణ భవన్లో ఉద్యమ ప్రస్థానానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.