మంచిర్యాల, విజయక్రాంతి : మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ పరిస్థితులను కళ్ల కట్టినట్లు చూపించే ఫోటో ఎగ్జిబిషన్ ను బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి తుల ఉమ ప్రారంభించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కృష్ణ పోరాటాల దృశ్యాలు అందరిని ఆకట్టుకున్నారు. ఆమె వెంట మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, చెన్నూర్ మాజీ శాసన సభ్యులు బాల్క సుమన్, మంచిర్యాల మాజీ శాసన సభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి మాజీ శాసన సభ్యులు దుర్గం చిన్నయ్య, బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.