04-12-2024 01:52:25 AM
7వ తేదీ నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్లు
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): డిప్లొమా ఇన్ ఎలిమెంట రీ ఎడ్యుకేషన్ అండ్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈ సెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను ఈనెల 5 నుంచి నిర్వహించనున్నారు. 7వ తేదీ నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించగా, 13న అర్హులైన అభ్యర్థులకు సీట్లను కేటాయించనున్నారు. ఈనెల 17 వరకు సీట్లు పొందిన కాలేజీల్లో అభ్యర్థులు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.