హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఈఈ సెట్) పరీక్ష బుధవారం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. తెలుగు మీడియం అభ్యర్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం అభ్యర్థులకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.