calender_icon.png 12 February, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉయ్యాల్లో కొడుకు... ట్రైనింగ్ లో తల్లి

11-02-2025 11:03:36 PM

అవధులు లేని తల్లిప్రేమ...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): విధి నిర్వహణ పట్ల అంకితభావం, కన్న బిడ్డపై అవధులు లేని ప్రేమ కలెక్టరేట్ కు వచ్చిన ప్రతి ఒక్కరిని కట్టేసింది. కన్న కడుపు కోసం కలెక్టరేట్ లో చీరతో ఉయ్యాల కట్టి, ఎన్నికల ట్రైనింగ్ వెళ్ళిన తల్లి వైనం మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ లో దర్శనమిచ్చింది. కలెక్టరేట్లో జరుగుతున్న ఏఎన్ఎం ల ట్రైనింగ్ కు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏఎన్ఎమ్ లు హాజరయ్యారు. అందులో భాగంగా పెనపాక మండలానికి చెందిన ఏఎన్ఎం శ్రీ రేఖ ట్రైనింగ్ కు హాజరయ్యారు. తన ఐదు నెలల కొడుకు కోసం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో చీరతో ఉయ్యాల కట్టి తల్లి ట్రైనింగ్ కి వెళ్ళిన సంఘటన చోటుచేసుకుంది. భోజన విరామ సమయంలో వచ్చి కొడుకుని లాలించి మళ్ళీ డ్రైనేజీ కు వెళ్ళింది. అప్పటివరకు శ్రీ రేఖ అత్త ఆ చిన్నారిని సంరక్షించింది. అక్కడి సిబ్బంది కొందరు చిన్నారుని ఎత్తుకొని లాలించారు.