calender_icon.png 22 February, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సేవలో అంకితభావం అవసరం

21-02-2025 01:00:44 AM

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల నిర్వహణలో డిజిస్టార్ రెస్పాన్స్ ఫోర్స్ పాత్ర చాలా కీలకమైందని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా డీఆర్‌ఎఫ్ సిబ్బంది ప్రజా సేవలో నిమగ్నం కావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు.

హైడ్రా డీఆర్‌ఎఫ్ విభాగానికి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఎంపికైన 347 మంది సిబ్బందికి అంబర్‌పేట పోలీసు శిక్షణా కేంద్రంలో గురువారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శిక్షణ ప్రారంభించారు.

ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. సమాజంలోనూ, ప్రభుత్వంలోనూ హైడ్రా ప్రధాన పోషిస్తుందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పడు ప్రజల ప్రాణాలతో పాటు, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో డీఆర్‌ఎఫ్ సిబ్బంది కీలకమైన పాత్ర పోషిస్తారని వివరించారు.