calender_icon.png 1 February, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకితభావం.. నిబద్ధత

01-02-2025 01:04:22 AM

కరీంనగర్ సిటీ, జనవరి31 (విజయ క్రాంతి): అంకితభావం.. నిబద్ధత.. విధుల నిర్వహణలో అత్యుత్తమంగా సేవలు.. 34 ఏళ్ల పాటు వివిధ జిల్లాల్లో ఉద్యోగ బాధ్యతల నిర్వహణ.. ఎక్కడ పనిచేసినా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర కనపరిచాడు ఏపీఆ ర్‌ఓ వీరాంజనేయులు. సౌమ్యునిగా పేరు పొందారు. . 

జనవరి 31వ తేదీ శుక్రవారం రోజున ఆయన ఉద్యోగ విరమణ చేశారు. కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సన్మాన కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ ఏ డి లక్ష్మణ్ మాట్లాడుతూ వీరాంజనేయులు సమాజసేవయే ఊపిరిగా ప్రజాహితమే ల క్ష్యంగా విధులు నిర్వర్తించారన్నారు.  ఉద్యోగ జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని వాటి తట్టుకుంటూ ముందుకు సాగారని.

నీతి, నిజాయితీగా వ్యవహరిస్తూ  పారదర్శ కంగా బాధ్యతలు నిర్వహించారన్నారు. స మాచార పౌర సంబంధాల శాఖలో పనిచే యడం తనకు సంతప్తినిచ్చిందని వీరాంజనే యులు ఈ సందర్బంగా పేర్కొన్నారు.  తన శేషజీవితాన్ని ప్రజాహిత సేవకే అంకితం చేస్తానన్నారు.