calender_icon.png 2 January, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

30-12-2024 01:52:27 AM

క్రమంగా పెరుగుతున్న చలి తీవ్రత

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత లు తగ్గుతున్నాయి. దీంతో చలి తీవ్రత కూడా క్రమంగా పెరుగుతోంది. అల్పపీడనం కారణంగా గత వారం రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు.. మరికొన్ని చోట్ల అధిక డిగ్రీలు నమోదయ్యాయి. ఆవర్తనం బలహీనపడటంతో మళ్లీ పెరుగుతోంది.

రాష్ట్రం లో కొన్ని చోట్ల అక్కడక్కడ మరో ఐదు రోజుల పాటు పొగమం చు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. వచ్చే 24 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఆదివారం రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు (12.9 డిగ్రీలు) నమోదయ్యాయి.