న్యూఢిల్లీ: దేశం నుంచి వస్తువుల ఎగుమతులు ఆగస్టు నెలలో క్షీణించాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 9.3 శాతం మేర పడిపోయాయి. గతేడాది ఇదే సమయంలో 38.28 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు ఈ ఏడాది 34.71 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం సంబంధిత డేటాను విడుదల చేసింది. అదే సమయంలో దిగుమతులు 3.3 శాతం మేర పెరిగాయి. గతేడాది ఆగస్టులో 62.3 బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు ఈ సారి 64.36 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం కారణంగా వాణిజ్య లోటు 29.65 బిలియన్ డాలర్లకు పెరిగింది.