calender_icon.png 5 December, 2024 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలంకారప్రాయంగా.. వ్యవసాయ చెక్‌పోస్ట్‌లు

14-11-2024 12:53:01 AM

  1. యథేచ్ఛగా వ్యవసాయ ఉత్పత్తుల అక్రమ రవాణా
  2. పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోతున్న పత్తి
  3. ప్రభుత్వాదాయనికి భారీగా గండి
  4. మార్కెట్ కమిటీలో వేధిస్తున్న సిబ్బంది కొరత

సంగారెడ్డి, నవంబర్ 1౩ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు సరిహద్దులో ఉంది. దీంతో సరిహద్దు లో పక్క రాష్ట్రాలకు వ్యవసాయ ఉత్పత్తుల అక్రమ రవాణాను నివారించేందుకు ప్రభు త్వం వ్యవసాయ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది.

ఈ చెక్ పోస్టుల ద్వారా పన్ను చెల్లించకుండా ఇతర రాష్ట్రాలకు తరలించే ఉత్పత్తు లను పర్యవేక్షించి, పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వాదాదాయనికి భారీగా నష్టం వాటిల్లు తోంది. రాష్ట్ర సరిహద్దులో జహీరాబాద్, నారాయణఖేడ్ డివిజన్‌లు ఉన్నాయి.

వ్యవసాయ శాఖ అధికారులు సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టకపోవడంతో వరి ధాన్యంతో పాటు ఇతర పంటలు పన్నులు చెల్లించకుండా తరిలిపోతున్నాయి. 65వ జాతీయ రహదారితో పాటు బీదర్ నారాయణ్‌ఖేడ్ నాగులిగిద్ద, కంగ్టి మండలాలకు సరిహద్దు రోడ్లు ఉన్నాయి. సరిహ ద్దులో చెక్‌పోస్టులు ఏర్పా టు చేసినా ఎక్కడ ఒక్క వాహనాన్ని తనిఖీ చేయడం లేదు.

చెక్‌పోస్టుల మీదుగా నిత్యం వందల సంఖ్య లో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం సిబ్బంది కొరతను సాకు గా చూపి వాహనాలను తనిఖీ చేపట్టడం లేదు. వ్యవసాయ చెక్‌పోస్టులు ఒక్కప్పుడు ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే కేంద్రాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు చెక్‌పోస్టులో ఒక్క వాహనాన్ని కూడా తనిఖీ చేయడం లేదు.

అడ్డదారుల్లో పత్తి తరలింపు?

సంగారెడ్డి జిల్లాలో వ్యాపారులు రైతుల వద్ద నేరుగా పత్తని కొనుగోలు చేసి అడ్డదారుల్లో గుజరాత్‌కు తరలిస్తున్నారు. కొందరు పత్తి వ్యాపారులు ఎక్కడా షాపులు ఏర్పాటు చేయకుండా నేరుగా రైతుల ఇండ్లకే వెళ్లి కొనుగోలు చేసి లారీల్లో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకుండా పోతుంది. ఎక్కడకైనా పత్తి తరలిస్తే విధిగా వ్యాపారులు మార్కెట్ పన్నులు చెక్‌పోస్టులో చెల్లించాల్సి ఉంటుం ది. కానీ సంగారెడ్డి జిల్లాలో ఎక్కడా వ్యవసాయ శాఖ చెక్‌పోస్ట్‌లో సిబ్బంది ఉండటం లేదు. 

‘మామూలు’గా వ్యవసాయ శాఖ చెక్‌పోస్టులు

ప్రతీ వ్యవసాయ చెక్‌పోస్ట్‌లో పంటల ఉత్పత్తులను తరలిస్తే విధిగా తనిఖీ చేసి మార్కెట్ పన్నులు చెల్లించారా? లేదా? అనేది పరిశీలించాలి. వాహనాల్లో తరలిస్తున్న సరకుకు చూపుతున్న పత్రాలకు సరిపోల్చాల్సి ఉంటుంది. మార్కెట్ కమిటీ చెక్‌పోస్టులో ఎక్కడా కూడా వ్యవసాయ అధికారులు ఎలాంటి తనిఖీలు చేయడం లేదు. వాహనదారులు ముందుగానే సిబ్బందికి మామూళ్లు అప్పగించడంతో చెక్‌పో స్టుల వద్ద గ్రీన్‌సిగ్నల్ లభిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సిబ్బంది కొరత పేరుతో తనిఖీలు నిల్

సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నా, సిబ్బంది కొరత పేరుతో తనిఖీలు చేపట్టడం లేదు. మార్కెట్ శాఖ అధికారులు ప్రధాన రోడ్లపై చెక్‌పోస్ట్ బోర్డులు ఏర్పాటు చేశారే తప్పా తనిఖీలు మాత్రం కొనసాగడం లేదు. మార్కెటింగ్ శాఖలో ఎక్కువ మంది సిబ్బం ది తాత్కాలిక పద్ధతిలో పని చేస్తున్నారు. వీరిపై అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.