- వరుసగా మూడో ఏడాదీ జనాభాలో తగ్గుదల
- 140.8కోట్లకు తగ్గిన చైనా జనాభా
బీజింగ్, జనవరి 17: చైనాలో జనాభా క్షీణత కొనసాగుతోంది. వరుసగా మూడో ఏడాదీ అక్కడ జనాభా తగ్గింది. అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 2024లో డ్రాగన్ కంట్రీ జనాభా 1.39 మిలియన్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం ఆ దేశ జనాభా 1.408బిలియన్ల (140.8కోట్ల)కు చేరుకుంది. తాజాగా చైనా స్టాటిస్టిక్స్ బ్యూరో విడుదల చేసిన నివేదిక ద్వారా ఈ విషయం వెల్లడైంది.
గతంలో చైనా ప్రవేశపెట్టిన ఒకే బిడ్డ విధానం ప్రస్తుత పరిస్థితి ప్రధాన కారణమ ని తెలుస్తుంది. వృద్ధుల సంఖ్య పెరగడం, పని చేసే వయసుగల వ్యక్తుల సంఖ్య క్రమం గా పడిపోతుండటంతో చైనా ప్రభుత్వం అ ప్రమత్తమైంది. ఈ క్రమంలోనే పిల్లలను కనాలని ప్రజలను ప్రోత్సహిస్తోంది. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు. మరోవైపు ఈస్ట్ ఆసియాలోని జపాన్, దక్షిణ కొరియా, హాంగ్ కాంగ్‌లో కూడా జ నాభా క్షీణిస్తోంది.