calender_icon.png 12 October, 2024 | 8:52 AM

క్షీణించిన పారిశ్రామికోత్పత్తి

12-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ఈ ఏడాది ఆగస్టు నెలలో దేశీయ పారిశ్రామికోత్పత్తి క్షీణించిం ది. శుక్రవారం కేంద్రం విడుదల చేసిన గ ణాంకాల ప్రకారం మైనింగ్, విద్యుత్ రంగా ల పేలవ పనితీరు కారణంగా ఆగస్టు నెలలో పారిశ్రామికోత్పత్తి 0.1 శాతం తగ్గింది. గత ఏడాది ఆగస్టు నెలలో ఈ రంగం 10.9 శా తం వృద్ధిచెందగా, ఈ ఏడాది జూలైలో 4.7 శాతం పెరిగింది. 2024 ఆగస్టులో మైనింగ్ రంగం ఉత్పత్తి 4.3 శాతం, విద్యుదుత్పత్తి 3.7 శాతం చొప్పున తగ్గాయి. తయారీ రం గం ఉత్పత్తి 0.1 శాతం క్షీణించింది. భారీ వ ర్షాల కారణంగా గనుల నుంచి ఉత్పత్తి తగ్గిందని జాతీయ గణాంకాల శాఖ వెల్లడించింది.