హైదరాబాద్, ఆగస్టు 6: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వ హిస్తున్న గ్లాండ్ ఫార్మా నికరలాభం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో 26 శాతం క్షీణించి రూ.144 కోట్లకు తగ్గింది. గత ఏడాది క్యూ1లో ఈ కంపెనీ రూ.194 కోట్ల నికరలాభాన్ని నమోదుచేసింది. తాజాగా ముగిసిన త్రైమాసి కంలో గ్లాండ్ ఫార్మా అమ్మకాల ఆదా యం రూ.1,209 కోట్ల నుంచి రూ. 1,402 కోట్లకు పెరిగింది. తమ ఆర్థిక సంవత్సరపు లక్ష్యాలను సాధించామని, రానున్న త్రైమాసికాల్లో పటిష్ఠమైన ఫలితాల్ని ప్రకటిస్తామని కంపెనీ ఎగ్జిక్యూ టివ్ చైర్మన్, సీఈవో శ్రీనివాస్ సాదు తెలిపారు. ఫలితాల నేపథ్యంలో గ్లాండ్ ఫార్మా షేరు మంగళవారం స్వల్ప తగ్గుదలతో రూ.2,109 వద్ద ముగిసింది.