calender_icon.png 18 January, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షీణించిన ఎగుమతులు

16-01-2025 01:36:38 AM

* డిసెంబర్‌లో 38 బిలియన్ డాలర్లు

న్యూఢిల్లీ, జనవరి 15: అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా డిసెంబర్ నెలలో దేశం నుంచి ఎగుమతులు 1 శాతం తగ్గి 38 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే భారీగా జరిగిన బంగారం దిగుమతులు కారణంగా గత నెలలో మొత్తంగా దిగుమతులు 5 శాతం పెరిగి 59.95 బిలియన్ డాలర్లకు చేరాయి.

అయినా వాణిజ్యలోటు మాత్రం 22 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యింది. బుధవాం కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం డిసెంబర్‌లో జెమ్స్, జ్యువెలరీ, రసాయినాల ఎగుమతులు మైనస్‌లోకి జారిపోయాయి. పెట్రోలియం ఉత్పత్తుల ఎగమతులు 38 శాతం వృద్ధిచెందాయి. మరోవైపు ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, బియ్యం, టెక్స్‌టైల్స్, ఫార్మా, మెరైన్ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయి