calender_icon.png 15 January, 2025 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గిన కార్ల అమ్మకాలు: సియామ్

14-09-2024 02:53:07 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13:  ఆగస్టులో హోల్‌సేల్ పాసింజర్ వాహన విక్రయాలు 2 శాతం తగ్గాయని సొసైటీ ఆఫ్ ఇం డియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) తెలిపింది. డిమాండ్ మందగించడంతో డీలర్లు వారి నిల్వలను తగ్గిం చుకునే ప్రక్రియలో ఉన్నారని, దాంతో డీలర్లకు కంపెనీల నుంచి వాహన సరఫరాలు తగ్గాయని సియామ్ వివరించింది. సియామ్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈ ఆగస్టులో దేశీయ మార్కెట్లో మొత్తం పాసింజర్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు 3,52,921 యూనిట్లు.

గత ఏడాది ఆగస్టులో ఇవి 3,59,228 యూనిట్లు. ముగిసిన నెలలో ద్విచక్ర వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు 9 శాతం పెరిగి 15,66,594 యూనిట్ల నుంచి 17,11,662 యూనిట్లకు పెరిగాయి. వీటిలో  మోటార్‌సైకిల్ డిస్పాచ్‌లు 9,80,809 యూనిట్ల నుంచి 10,60,866 యూనిట్లకు చేరాయి. స్కూటర్ డిస్పాచ్‌లు 5,49,290 యూని ట్ల నుంచి 6,06,250 యూనిట్లకు చేరాయి. త్రీవీలర్ హోల్‌సేల్ అమ్మకాలు 64,944 యూనిట్ల నుంచి 69,962 యూనిట్లకు పెరిగాయి.పండుగ సీజన్‌లో ప్రవేశించినందున వాహన అమ్మకాలకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నామని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ చెప్పారు.