- గ్రామసభల్లోనే లబ్ధిదారుల ఎంపిక
- పకడ్బందీగా రైతు భరోసా
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం, జనవరి 19 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వంలో ప్రజల సమక్షంలోనే నిర్ణయాలు ఉంటాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ నెల 26 నుం చి రైతు భరోసాతో సహా నాలుగు సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసేందు కు కసరత్తు జరుగుతోందని తెలిపారు.
ఆదివారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం లో పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగు కు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు ఎకరాకు రూ.12వేల చొ ప్పున రైతు ఖాతాల్లో జమ చేస్తామన్నారు.
గ్రామ సభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. ఏ సమస్య వచ్చి నా అక్కడే పరిష్కరిస్తామన్నారు. కాగా బనిగండ్లపాడు ఆస్పత్రిలో అభివృద్ధికి ప్రణాళిక తయారు చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. జూనియర్ కళాశాలకు నిధులు మంజూరు చేసి, పూర్వ వైభవం తెస్తామన్నారు.
ఎర్రుపాలెం మండల కేం ద్రంలో మరో 50 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎర్రు పాలెం మండలం సఖినవీడులో భట్టి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరా వు, డీఎంహెచ్‌వో బీ కళావతి, ఖమ్మం ఆర్డీ వో నరసింహారావు, డీపీవో ఆశాలత పాల్గొన్నారు.