షబ్బీర్ అలీ...
కామారెడ్డి (విజయక్రాంతి): రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమల్లో గ్రామసభ నిర్ణయాలే కీలకమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనవరి 26న రైతు భరోసాతో పాటు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పారు. సాగుకు యోగ్యమైన భూములకే రైతు భరోసా అందుతుందన్నారు. గ్రామసభలో వచ్చిన అభ్యంతరాలను 10 రోజుల్లో అధికారులు నివృత్తి చేస్తారని తెలిపారు. పాత రేషన్ కార్డులు తొలగిస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని ఆయన స్పష్టం చేశారు.