calender_icon.png 28 November, 2024 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈహెచ్‌ఎస్‌పై డిసెంబర్ 5 తర్వాత నిర్ణయం!

28-11-2024 12:18:10 AM

టీజీవో సంఘం నాయకులకు మంత్రి రాజనర్సింహ హామీ

హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): డిసెంబర్ 5 తర్వాత రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో చర్చించి ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్‌ఎస్)పై నిర్ణయం తీసుకుంటామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. టీజీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం సచివాలయంలో మంత్రిని కలిసి ఈహెచ్‌ఎస్‌పై చర్చించారు.

ఉద్యోగుల సహకారానికి సంబంధించిన విధివిధానాలపై చర్చించాలని వారికి మంత్రి సూచించినట్టు టీజీవో నాయకులు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. నాయకులు రామకృష్ణగౌడ్, శ్రీరామ్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్ పాల్గొన్నారు.