calender_icon.png 18 January, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనర్హతపై నిబంధనల మేరకు నిర్ణయం

11-09-2024 12:55:22 AM

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ 

హైదరాబాద్,సెప్టెంబర్ ౧౦ (విజయక్రాంతి) : పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో హైకోర్టు ఇచ్చిన నాలుగు వారాల గడువుపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ స్పందించారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో నిబంధనల మేరకు నడుచుకుంటామని, తాను తీసుకునే నిర్ణయం రాబోయే కాలనికి తెలుస్తోందన్నారు. పార్టీ ఫిరాయింపుల కేసు కోర్టు పరిధిలో ఉందన్నారు. 

షిరిడీ సాయినాథుడిని దర్శించుకున్న స్పీకర్ 

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మంగళవారం మహారాష్ట్రలోని షిరిడీ సాయినాధుని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్పీకర్‌కు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు.