calender_icon.png 24 February, 2025 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోటీపై 17న నిర్ణయం: తలసాని

13-02-2025 02:04:55 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పో టీపై 17వ తేదీన నిర్ణయం తీసుకుంటామని  తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం మాట్లాడుతూ.. మేయర్, డిప్యూటీ మే యర్ అవిశ్వాసంపై కేటీఆర్ ఆధ్వర్యంలో వచ్చే వారం మీటింగ్ ఉంటుందని పేర్కొన్నారు. త్వర లో జీహెఎంసీ కార్పోరేటర్లతో కేసీఆర్, కేటీఆర్ సమావేశమవుతారని తెలిపారు.

పరిస్థితులకు అనుగుణంగా మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వాసంపై నిర్ణయం ఉంటుందన్నారు. కాంగ్రెస్ అన్నీ తెలిసే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హామీ ఇచ్చిందన్నారు. కులగణన సర్వేలో చా లా తప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు 90 శాతం  ఉన్నారని.. రాష్ట్రంలో 60 లక్షల మందికి లెక్క లు లేవని చెప్పారు. జనాభా తక్కువ చూపిస్తే నిధులు తక్కువ వస్తాయని పేర్కొన్నారు.