17-02-2025 08:34:29 PM
వామపక్షాల జిల్లా ఉమ్మడి సమావేశంలో నిర్ణయం..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బడ్జెట్ను నిరసిస్తూ వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 19న నిరసన కార్యక్రమం చేయనున్నట్లు పార్టీల జిల్లా నాయకులు వెల్లడించారు. వామపక్షాల జిల్లా సమావేశం సిపిఎం జిల్లా కార్యాలయంలో సోమవారం సిపిఎం జిల్లా కార్యదరి మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ అనుకూల బడ్జెట్ పేదలపై బారాలు మోపే బడ్జెట్ గా ఉందని బడ్జెట్ని సవరించి కార్పొరేట్లపై నాలుగు శాతం పన్నులు విధించి ప్రజల సంక్షేమ పథకాల కోసం అధికంగా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.
అందుకు ప్రత్యామ్నాయ బడ్జెట్ను రూపొందిస్తూ కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచుతున్నామని ప్రత్యామ్నాయ బడ్జెట్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చా యని అందులో భాగంగా ఈనెల 19న జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు..
వామపక్షాల ప్రత్యామ్నయ ప్రతిపాదనలు..
1) దేశంలో 200 మంది శత కోటీశ్వరులపై 4% సంపద పన్ను ప్రవేశపెట్టాలి.
2) కార్పోరేట్ పన్ను పెంచాలి.
3) వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దత్తు ధరకు హామీ కల్పించాలి.
4) భీమా రంగంలో 100% ఎఫ్ఎఐ ఉపసంహరించాలి.
5) ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వారికి అప్పగించటం ఆపాలి.
6) ఉపాధి హామి పథకం 50% నిధులు కేటాయింపులు పెంచాలి. పట్టణాలకు వర్తింప చేయాలి.
7) ఆరోగ్య, విద్యారంగాలకు జిడిపిలో 3% చొప్పున కేటాయించాలి.
8) ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆహార సబ్సిడీ పెంచాలి.
9) ఎస్సి, ఎసిటి రంగాలకు, మహిళా, శిశు సంక్షేమానికి కేటాయింపులు పెంచాలి.
10) స్కీం వర్కర్ల గౌరవ వేతనంలో కేంద్రం వాటాను పెంచాలి.
11) రాష్ట్రాలకు నిధులు బదిలీ పెంచాలి.
12) పెట్రోలియం ఉత్పత్తులపై సెస్సులు, సర్చార్జీలను రద్దు చేయాలి.
ఈ సమావేశంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, సిపిఐ(యంఎల్) మాస్న్, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, ఎస్కే సాబీర్ పాషా, గౌని నాగేశ్వరరావు నాయకులు అన్నవరపు కనకయ్య అన్నవరపు సత్యనారాయణ జమలయ్య, వాసిరెడ్డి మురళి, భూక్య శ్రీను, మాచర్ల శ్రీను జె. సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.