calender_icon.png 8 October, 2024 | 10:46 PM

ఫార్మా సిటీపై నిర్ణయం చెప్పండి

04-09-2024 01:25:20 AM

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఫార్మాసిటీ ఏర్పాటుపై నిర్ణయం ఏమిటో చెప్పాలంటూ ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఫార్మాసిటీని కొనసాగిస్తున్నారా? లేదా? అన్న దానిపై సంబంధిత అధికారి స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. ఫార్మాసిటీ ఏర్పాటు నిమిత్తం సేకరించిన భూముల పరిహార అవార్డు చెల్లదంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో తమ భూములపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ మేడిపల్లికి చెందిన రామచంద్రయ్య మరో 48 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ మంగళవారం విచారణ చేపట్టగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2017లో జారీచేసిన భూసేకరణ నోటిఫికేషన్ ఆధా రంగా ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించకుండా అవార్డు నోటిఫికేషన్ జారీ చేయడంతో దాన్ని సింగిల్ జడ్జి రద్దు చేస్తూ గత ఏడాది తీర్పు వెలువరించారని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేసినట్టు పత్రికల్లో కథనాలు వచ్చాయని, అందువల్ల రైతుల భూములపై ఉన్న ఆంక్షలను తొలగించాలని కోరారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఏ దివ్య వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు వాస్తవాలను వెల్లడించలేదని అన్నారు.

సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం అప్పీ ళ్లు దాఖలు చేసిందని, ప్రస్తుతం అవి ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ముందు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఏవైనా మధ్యంతర ఉత్తర్వులున్నాయా అంటూ ప్రశ్నించగా లేదంటూ న్యాయవాది సమాధానం ఇచ్చారు. దీనిపై న్యాయమూర్తి స్పంది స్తూ ఎలాంటి ఉత్తర్వులు లేనపుడు ఆ విషయం ఇక్కడ అనవసరమని అన్నా రు. ఫార్మాసిటీ రద్దయినట్టు పిటిషనర్ తరఫు న్యాయవాది పత్రికా కథనాలను చూపుతున్నారని, వాటిని ఆధారంగా ఉత్తర్వులు జారీ చేయలేమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధి కారి వెల్లడించాలంటూ విచారణను 6వ తేదీకి వాయిదా వేశారు.

హుస్సేన్‌సాగర్ ఎఫ్టీఎల్ వివరాలివ్వండి

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్,సెప్టెంబర్ 3(విజయక్రాంతి): హుస్సేన్‌సాగర్ ఎఫ్టీఎల్ వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ పట్టా స్థలాల రక్షణ నిమిత్తం రక్షణకు ఫెన్సింగ్ షీట్లను ఏర్పాటుకు అనుమతించాలంటూ ఇచ్చిన వినతి పత్రాలను అధికారులు పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీ శరణ ప్పస్వామి మరో 9 మంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ టీ వినోద్‌కుమార్ విచారణ చేపట్టారు. ప్రభుత్వ న్యాయవాది వాదన లు వినిపిస్తూ.. ఫెన్సింగ్ ఏర్పాటు నిమిత్తం పిటిషనర్లు చెప్తున్న స్థలం ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని, అందువల్ల అనుమతించలేదని చెప్పారు. దీనిపై హుస్సేన్‌సాగర్ చిత్రాన్ని అందజేశారు. ఇందులో స్పష్టత లేకపోవ డంతో పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.