calender_icon.png 28 November, 2024 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ- కేవైసీకి డిసెంబర్ ౩1 చివరి గడువు

28-11-2024 01:26:56 AM

  1. ఆహార భద్రతకార్డుదారులూ ప్రక్రియ పూర్తి చేయండి..
  2. మెదక్ జిల్లాలో నత్తనడకన సాగుతున్న నమోదు

మెదక్, నవంబర్ 2౭ (విజయక్రాంతి): ఆహారభద్రత కార్డులకు సంబంధించి జిల్లాలో ఈ-కేవైసీ నత్తనడకన సాగుతోంది. కాగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకే రేషన్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు. కుటుంబంలో లబ్ధిదారుల్లో ఎవరైనా ఈ చేయించుకో కుంటే వారి పేర్లను కార్డు నుంచి తొలగించనున్నారు.

ఈ గడువును ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. గతనెలతో ముగిసిన గడువును డిసెంబర్ 31 వరకు పెంచింది. ఇదే ఆఖరిసారని, మరోసారి అవకాశం ఉండబోదని స్పష్టం చేసింది. గడువులోగా పేర్లను నమోదు చేయించుకోవాలని లేకుంటే పథకాల లబ్ధికి ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు చెబుతున్నారు. జిల్లా లో పలువురు లబ్ధిదారులు ఎన్నిసార్లు తిరిగినా బయోమెట్రిక్ పూర్తి కావడం లేదు.

వేలిముద్రలు పడకపోవడం, ఆధార్ కేంద్రానికి వెళ్లినా ఈ-కేవైసీ కాకపోవడంతో విసిగిపోతున్నారు. వృద్ధుల విషయంలో ఈ సమస్య లు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ ప్రక్రియ జిల్లాలో ఇప్పటికీ పూర్తి కాలేదని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వం గడువు పొడిగిస్తుందనో, ఇతర కారణాలతో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆధార్ నవీకరించకపోవడం, బయోమెట్రిక్ ఇబ్బం దులు, సాంకేతిక సమస్యలు ఎదురవ్వడం వల్ల ఈ-కేవైసీలో జాప్యం జరుగుతోంది. గత పదేళ్లలో చాలామంది చనిపోయారు. వారి వివరాలు అప్‌డేట్ చేయలేదు. 


తప్పనిసరిగా ఈకేవైసీ చేయించాలి

ప్రతిఒక్కరూ తమ రేషన్ డీలర్లను సంప్రదించి వివరాలు నమోదు చేయించుకోవాలి. ఆధార్‌కు సంబంధించి సమస్యలుంటే ముందే పరిష్కరించుకోవాలి. ఇదివరకే ఈ కేవైసీ పూర్తిచేసుకున్న వారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదు. నిర్లక్ష్యం చేస్తే తర్వాత ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

 జిల్లా పౌర సరఫరాల అధికారి