* ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): బూటకపు హామీలతో రాష్ట్ర యువతను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్ మో సం చేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి త ఆరోపించారు. ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన తెలంగాణ జాగృతి నాయకులతో శుక్రవారం తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం చెబుతున్నవన్నీ కాకి లెక్కలేనన్నారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్య వెలమ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ చేసి వ్యాఖ్యలు ఆయన స్థాయి కి తగదన్నారు. వాంకిడి గురుకులంలో విషాహారం తిని మృతిచెందిన శైలజ కుటుంబానికి కవిత రూ. 2లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.