calender_icon.png 30 November, 2024 | 11:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగం పేరుతో సైబర్ మోసం

29-10-2024 02:19:59 AM

2.20 లక్షలు లూటీ

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ఉద్యోగం కల్పిస్తామని ఓ నిరుద్యోగిని మోసగించి రూ. 2.20 లక్షలను కాజేశారు సైబర్ నేరగాళ్లు. వివరాలిలా ఉన్నా యి.. నగరానికి చెందిన ఓ నిరుద్యోగి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఉద్యోగ ప్రకటన చూసి అందులోని నంబర్‌కు ఫోన్ చేసి జాబ్ వివరాలను తెలుసుకున్నాడు. అవతలి వ్యక్తి సో షల్ మీడియాలో వచ్చే వీడియోలకు లైక్‌లు కొడితే డబ్బులు చెల్లి స్తామని చెప్పాడు.

ఈ క్రమంలో బాధితుడు మూడు వీడియోలకు లైక్ కొట్టి వాటి స్క్రీన్ షాట్లను వారికి పంపించాడు. అనంతరం వారు ఓ టెలిగ్రామ్ లింక్‌ను అందించారు. అందులో బాధితుడి వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకింగ్ వివరాలు పొందుపరచాలని సూచించారు. వేతనం రూపంలో తొలుత రూ. 150 బాధితుడి ఖాతాకి బదిలీ చేశా రు. అనంతరం మరింత సంపాదించడానికి ‘వీఐపీ గ్రూప్’ అనే గ్రూప్‌లో చేరాలని, పెట్టిన పెట్టుబడికి 30శాతం లాభాలు అంది స్తామని చెప్పారు.

ఇదంతా నిజమేనని నమ్మిన బాధితుడు మొదట్లో కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టి లా భాలను అందుకున్నాడు. ఇలా మొత్తం రూ. 2.20 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. ఆ తర్వాత అవతలి వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్ర హించి సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.