calender_icon.png 30 October, 2024 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ ఇళ్లు ఇప్పిస్తానని మోసం

30-10-2024 12:18:31 AM

పోలీస్ స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు 

కూకట్‌పల్లి, అక్టోబర్ 29: డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని మోసానికి పాల్పడిన ఓ వ్యక్తిపై కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. బోయిన్‌పల్లికి చెందిన వేణుగోపాల్ దాస్ అనే వ్యక్తి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని చెప్పి కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ ప్రాంతాలకు చెందిన పలువురు మహిళల దగ్గర రూ.1.75 లక్షల నుంచి రూ.2.50 లక్షల చొప్పున వసూలు చేశాడు.

ఈ విధంగా 15 మంది నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేశాడు. ఎంపీ ఎన్నికలు పూర్తయ్యాక డబ్బులు చెల్లించిన వారికి ఇళ్లు కేటాయిస్తామని చెప్పాడు. ఎన్నికల తర్వాత బాధితులకు నకిలీ పత్రాలతో పాటు నకిలీ తాళాలను అందజేశాడు. దీంతో వారు దుండిగల్‌లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గరికి వెళ్లి చూడగా, అంతకుముందే వేరేవాళ్లు అక్కడ ఇళ్లలో ఉండ టంతో తాము మోసపోయినట్లు గుర్తించారు.

దీంతో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముందు తమ మొర వినిపించగా, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయ మని బాధితులకు సూచించారు. ఈ మేరకు 8 మంది బాధితులు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.