calender_icon.png 17 November, 2024 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పులు తగ్గె.. వడ్డీలు పెరిగె!

09-09-2024 05:48:02 AM

  1. గతేడాది జూలై నాటికి బడ్జెట్ అంచనాల్లో 53% రుణం
  2. ఈ ఏడాది 47.84 శాతానికి తగ్గిన అప్పులు 
  3. 2023 మొదటి 4 నెలల్లో కట్టిన కిస్తీలు 32.02 % 
  4. ఈసారి సర్కారు చెల్లించిన మిత్తీలు 46.21% 
  5. పదేళ్లలో తొలిసారి 14 శాతం ఎక్కువ వడ్డీలను కట్టిన ప్రభుత్వం 
  6. కాగ్ 2024 జూలై ఆర్థిక నివేదిక

హైదరాబాద్, సెప్టెంబర్ ౮ (విజయక్రాంతి): అప్పులను తగ్గించుకొని రాష్ట్ర ఖజానాపై భారాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వడ్డీల చెల్లింపు సవాల్‌గా మారింది. అప్పులను తగ్గించుకున్నా మిత్తీల భారం మాత్రం నెలనెలా పెరుగుతూ వస్తోంది. గత పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి నాలుగు నెలల్లో అత్యధిత వడ్డీలను ప్రభుత్వం కట్టింది. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్సియల్ రిపోర్టును తాజా గా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ప్రకటించగా.. అందులో ఇలాంటి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. గత ప్రభుత్వంలాగా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయబోమని అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కారు పేర్కొంది.

చెప్పిన ప్రకారమే క్రమంగా అప్పులను తగ్గించుంటూ వస్తోంది. ఈ ఏడాది జూలై నాటికి ప్రభుత్వం రూ.23,563.71కోట్ల అప్పులు చేసినట్టు కాగ్ గణాంకాలు చెప్తున్నాయి. ఇది బడ్జెట్ అంచనాల్లో 47.84 శాతం. అయితే గతేడాది బీఆర్‌ఎస్ సర్కారు 53.97 శాతం రుణాన్ని తీసుకుంది. అంటే, గతేడాదితో పోలిస్తే 6.13 రుణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించుకున్నది. ఈ లెక్కన వడ్డీల భారం కొంతైనా తగ్గుతుందని రేవంత్ సర్కారు భావించింది. కానీ, తగ్గాల్సింది పోయి గత పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఏప్రిల్‌జూలై నెలలకు 46.21శాతం మిత్తీలు కట్టింది. ఇది గతేడాది కంటే 14శాతం అధికం. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఈ స్థాయిలో కిస్తీలను ప్రభుత్వం ఎప్పుడూ చెల్లించలేదని కాగ్ లెక్కలు వెల్లడించాయి. 

నివేదికలోని కీలకాంశాలు.. 

  1. ఈ ఏడాది ఏప్రిల్ మధ్య కాలంలో రెవెన్యూ రాబడులు తగ్గినట్టు కాగ్ నివేదిక చెప్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం మొత్తం రూ.2,21,242 కోట్లు అంచనా వేసింది. అయితే ఏప్రిల్‌జూలై మధ్య కాలంలో రూ.47,712 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 21.57 శాతం. గతేడాది ఇదే సమయానికి 21.63 శాతం రెవెన్యూ రాబడులు వచ్చినట్టు కాగ్ గణాంకాలు చెప్తున్నాయి. 
  2. ఎక్సయిజ్ డ్యూటీ దాదాపు 5 శాతం తగ్గింది. ఈ ౪ నెలల్లో ఎక్సయిజ్ డ్యూటీ రూ.6416.19 కోట్లు వసూలైంది. ఇది బడ్జెట్ అంచనాల్లో 25.5 శాతం. గతేడాది ఇదే సమయానికి 30.55 ఎక్సయిజ్ డ్యూటీ వచ్చింది.
  3. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మీద వచ్చే ఆదాయం గతేడాది ఇదే సమయానికి కంటే పెరిగింది. 2023 ఏప్రిల్ మధ్య బడ్జెట్ అంచనాల్లో 25.33 శాతం ఆదాయం రాగా.. ఈ ఏడాది 26.01 శాతం వచ్చినట్టు కాగ్ నివేదిక వెల్లడించింది.
  4. పెన్షన్ల మీద ప్రభుత్వం చేసే ఖర్చు గతేడాది కంటే ఈ ఏడాది పెరిగింది. 2023 బడ్జెట్ అంచనాల్లో ఏప్రిల్ మధ్య 41శాతం ఖర్చు చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది మాత్రం 49 శాతం వెచ్చించింది.
  5. ద్రవ్యలోటు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదికి దాదాపు 10 శాతం పెరిగింది. 2023 ఏప్రిల్ జూలై మధ్య ద్రవ్యలోటు 36.81శాతం ఉంటే.. ఈ ఏడాది అది 47.84 శాతానికి పెరిగింది.

గత పదేళ్లలో ఏప్రిల్ మధ్య ప్రభుత్వం చెల్లించిన వడ్డీలు, బడ్జెట్ అంచనాల్లో శాతం వివరాలు