25-03-2025 01:12:01 AM
హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): అసెంబ్లీ వేదికగా సోమవారం రాష్ట్ర బడ్జెట్‌పై సాగిన చర్చ వాడీ వేడిగా సాగింది. రుణమాఫీ వందశాతం పూర్తి కాలేదని, రుణమాఫీ వర్తించని రైతులకు న్యాయం చేయాలని బీజేపీ ఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ డిమాండ్ చేయగా.. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంటనే స్పందించారు.
దేశంలో రూ.20 వేల కోట్ల రుణాలను ఒకేసారి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని కొనియాడారు. మంత్రి అనం తరం సభ్యులెవరూ ప్రశ్నించకుండానే ‘రైతుభరోసా’పై స్పష్టతనిచ్చారు. ఈ నెలాఖారులోపు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తా మని తేల్చిచెప్పారు.
ముందుగా సభ ప్రారంభం కాగా నే మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క పురపాలక, పట్టణాభివృద్ధి, బీసీలు, దివ్యాంగులు, మైనార్టీల సంక్షేమం, ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమానికి సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టారు. ఆయా బిల్లులపై ప్రతిపక్ష, విపక్షాలకు చెందిన సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. అభ్యంతరాలు లేవనెత్తారు. వారి ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు.
రుణమాఫీ కోసం ఎదురుచూపులు.. : బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్
రుణమాఫీ వర్తించని రైతులు తమకెప్పుడు రుణమాఫీ వర్తిస్తుందా? అని ఎదురుచూస్తున్నారని, వారం దరికీ ప్రభుత్వం న్యాయం చేయాలని బీజేపీఎల్పీ ఉప నేత పాయల్ శంకర్ చేశారు. రైతుల సౌకర్యార్థం కం ట్రోల్ రూం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆదిలాబాద్‌లో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నిర్మించేందుకు కేంద్రం ముందుకు వచ్చిందని, కానీ..
గత ప్రభుత్వం స్థలం సేకరించలేకపోయిందని, ఈ ప్ర భుత్వమైనా స్పందించి, స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని 25 చెరువులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో బాగు చేస్తామని కొ న్ని కార్పొరేట్ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయని, లేక్ వ్యూ పేరిట ఆయా సంస్థలు కోట్లు దండుకున్నాయని ఆరోపించారు. వాటిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు.
సుమారు తొమ్మిదేళ్ల నుంచి రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లు మూతపడినట్లు కనిపిస్తున్నదని, ఈ ప్రభుత్వమైనా వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రంజాన్ సందర్భంగా అంటూ కేవలం మైనార్టీ విద్యాసంస్థలకు మాత్రమే ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించారని, మిగతా వర్గాల ను విస్మరించారని ఆరోపించారు.
ఉగాది సందర్భంగా బీసీ వర్గాలకు చెందిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను సైతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన పథకాలు అమలు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆపసోపాలు పడుతున్నారనిఎద్దేవా చేశారు. సీఎం పదవిలో ఉండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని క్యాన్సర్‌తో పోల్చడం సమంజసంగా లేదని అభిప్రాయపడ్డారు.
‘ఎన్నికలకు ముందు సీఎం కు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా? అవన్నీ తెలియకుండానే ఇష్టారీతిన హామీలెందుకు ఇచ్చారు’ అంటూ నిలదీశారు. రాష్ట్ర ఖజానాను నింపేందుకు వి లువైన ప్రభుత్వ భూములను విక్రయించేందుకు సిద్ధపడడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఒకవేళ భూము లు అమ్మాలనుకుంటే ప్రభుత్వమే అమ్మనక్కర్లేదని, రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు అప్పగించినా సరిపోతుందన్నారు. ‘భూములు అమ్మి చేసే అభివృద్ధి.. ఒక అభి వృద్ధా?’ అంటూ మండిపడ్డారు. ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూనే సీఎంవో అధికారులు ప్రాజెక్టుల విజిట్ కోసం హెలీక్యాప్టర్లను వినియోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
పైసా పైసా లెక్కగట్టి రుణమాఫీ చేశాం.. : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రుణమాఫీ బీజేపీఎల్పీ ఉప నేత పాయల్ శంకర్ లేవనెత్తిన ప్రశ్నలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. ‘దేశంలో మరే ఇతర రాష్ట్రంలో అమలు చేయని విధంగా రుణమాఫీ అమలు చేశాం. చిన్న రాష్ట్రమైనప్పటికీ ఒకేసారి రూ. 20 వేల కోట్ల రుణమాఫీ చేసి రికార్డు సృష్టించాం.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో కేవల రూ.11 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసింది. అది కూడా నాలుగు దఫాలుగా మాఫీ చేసింది. ఆ మొత్తం కనీసం వడ్డీలకైనా సరిపోలేదు. సగం మంది రైతుల రుణాలైనా మాఫీ కాలేదు. ఆ భారాన్ని కూడా ఇప్పుడు మా ప్రభుత్వమే మోసింది. మొత్తంగా లెక్కగట్టి మరీ రైతు రుణమాఫీ చేశాం.
తద్వారా రైతులకు రూ.2 లక్షల వరకు రుణవిముక్తి కలిగింది. రైతులను మోసగించిన వారు, దగా చేసిన వారిప్పుడు రుణమాఫీ గురించి మాట్లాడితే రైతులు అసహ్యించుకుంటారని తీవ్ర స్వరంలో వ్యాఖ్యానించారు. అలాగే ఈ నెలాఖరులోపు రైతుభరోసా సొమ్మును సైతం రైతుల ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ అందరికీ ఇచ్చాం.. : మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు
బీజేపీ ఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చేసిన వ్యాఖ్యలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు స్పందించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హులందరికీ చెల్లించామని స్పష్టం చేశారు. రంజాన్ సందర్భంగా ఇమామ్, మౌజన్లకు పెండింగ్ వేతనాలు చెల్లించామని స్పష్టం చేశారు. అలాగే ఉగాది సందర్భంగా ఆలయ అర్చకులకు సైతం వేతనాలు చెల్లిస్తామని తేల్చిచెప్పారు.
40శాతం వీధి దీపాలు వెలగడం లేదు.. : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద
హైదరాబాద్ మహానగర పరిధిలో రాత్రిళ్లు 40శా తం వీధి దీపాలు వెలగడం లేదని బీఆర్‌ఎస్ సభ్యుడు కేపీ వివేకానంద వాపోయారు. సీసీ కెమెరాల నిర్వహణ సైతం అధ్వానంగా ఉందని విమర్శించారు. బడ్జెట్‌లో జలమండలి పనులకు సరైన కేటాయింపులు చేయకపోవడం దారుణమని దుయ్యబట్టారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పద్దులో రూ.120 కోట్లు కేటాయించేందని, ఆ కేటాయింపులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు రూ.50 కోట్లకు పడిపోయిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించలేదో సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నగరంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి 72 సబ్ స్టేషన్లు నిర్మించాల్సి ఉందని, ఏడాది క్రితం ఈ ప్రతిపాదన జరిగిందని సభ దృష్టికి తీసుకొచ్చారు.
ప్రభుత్వ పెద్దలు తమకు కావాల్సిన వ్యక్తికి కాంట్రాక్టు ఇచ్చేందుకు సిద్ధమైందని, ఏకంగా 200 సబ్ స్టేషన్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారని అభ్యంతరం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పనులకు సర్కార్ రాంకీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని, కానీ.. క్షేత్రస్థాయిలో పనులు మాత్రం కార్మికులే చేస్తున్నారని, బిల్లులు మాత్రం రాంకీ సంస్థకు వెళ్తున్నాయని దుయ్యబట్టారు.
ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో సర్కార్ వసూళ్లకు పాల్పడుతున్నదని, ప్రభుత్వం ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్తుందని, వాటి గ్రౌండింగ్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
50 శాతం చెరువులు అన్యాక్రాంతం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
పదేళ్ల పాటు సాగిన బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్ మహానగర పరిధిలోని 50శాతం చెరువులు అన్యాక్రాంతమయ్యాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. ధరణి పేరుతో గత పాలకులు ప్రభుత్వ భూములు, పేదల భూములను కొల్లగొట్టారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన 90 ఎకరాల భూమిని బెదిరించి చౌకగా సొంతం చేసుకున్నారని ఆరోపించారు.
కబ్జాలపై విచారణ జరిపించాలన్నారు. హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరి నీరులా మారుస్తానని బీరాలు పలికారని, హైదరాబాద్‌ను డలాస్ చేస్తామని చిలుక పలుకులు పలికారని, కానీ.. ఆచరణలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణాత్మకంగా ముందుకు వెళ్తుందని, దీనిలో భాగంగానే లండన్‌కు దీటుగా ప్యూచర్ సిటీ నిర్మిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హయత్ నగర్ వరకు నిర్మించ తలపెట్టిన మెట్రో రైల్ లైన్‌ను పెద్ద అంబర్‌పేట వరకు పొడిగించాల్సిన అవసరం ఉందన్నారు.
సర్కార్ భూములు ఎందుకు అమ్మకూడదు?
ప్రభుత్వ భూముల అమ్మ కంపై బీజేపీ ఎల్పీ ఉపనేత పాయ ల్ శంకర్ ప్రశ్నలకు అసెంబ్లీ వ్యవ హారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమాధానమిచ్చారు. ‘భూముల అమ్మొద్దు.. కానీ, అభివృద్ధి కావాలంటే ఎలా కుదురుతుంది’ అని ప్రశ్నించారు. ఒకవైపు కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థల న్నింటినీ ప్రైవేటీకరిస్తున్నదని, కానీ.. రాష్ట్రప్రభుత్వం భూములు అమ్మితే మాత్రం తప్పుబట్టడం సరికాదన్నారు.
మంత్రి శ్రీధర్‌బాబు