28-03-2025 01:42:22 AM
రుణం రణం
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ‘ఓ స్త్రీ రేపురా’ అన్నట్లుగా ఉంది. తెల్లారి లేస్తే ప్రజా పాలన అంటారు, కానీ నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో.. మీ ప్రజా పాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి అంతే ఉంది. ఇది ప్రజాపాలన కాదు. ప్రజా పీడన. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటున్నారు. కానీ అత్తా కోడళ్లకు పంచాయితీ పెట్టారు. తులం బంగారం లంకె బిందెలు దొరికినాక ఇస్తారా? ఆసరా పెన్షన్ల కోసం గొడవలు జరుగుతున్నాయి.
అంత ఫ్రస్టేషన్ ఉండి.. రంకెలు వేస్తామంటే కుదరదు. పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు.. బీఆర్‌ఎస్ పథకాలు, ప్రాజెక్టులను ఎందుకు రద్దుచేశారు. అప్పటికే ఎయిర్‌పోర్టుకు మెట్రో టెండర్ అయిపోయినా రద్దుచేశారు. ఫార్మా సిటీలు వద్దన్నారు. ఇప్పుడు ఫార్మా విలేజ్‌లు ముద్దంటున్నారు.
బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
ఆదాయం పెంచినం.. రైతులు, ప్రజలకు పంచినం
కేంద్రానికి 5.1 శాతం జీడీపీ తెలంగాణ ఇస్తోంది
తెలంగాణ దిగ్గజ రాష్ట్రమే.. దివాలా రాష్ట్రం కాదు
కేంద్రంపై కొట్లాడాల్సిందే!.. మేమూ కలిసి వస్తాం
కేంద్రంతో మేం సఖ్యతగా ఉన్నా చిల్లిగవ్వ ఇవ్వలేదు
కేసీఆర్ తెలంగాణ జాతిపిత.. రేవంత్‌రెడ్డి బూతుపిత
అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ మండిపాటు
హైదరాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): తొమిదిన్నర ఏండల్లో రాష్ట్ర సంపదను పెంచి, కాళేశ్వరం ఇతర సాగు, తాగు నీటి ప్రాజెక్టులు, పథకాలకు ఖర్చు చేయడంతోపాటు ప్రజలకు పంచామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారక రామా రావు పేర్కొన్నారు. తెలంగాణ అప్పుల రాష్ట్రం కాదని, ధనిక రాష్ట్రమన్నారు.
87 శాతం అప్పులు క్యాపిటల్ ఎక్స్‌పెన్డేచర్‌పై పెట్టామని కాగ్ నివేదికే చెబుతున్నదని స్పష్టం చేశా రు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో భాగంగా గురువారం అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడారు. దేశంలో తెలంగాణ కంటే ముందు మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి కానీ, ఇంకా ఆ మూడు రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదన్నారు.
కానీ తెలంగాణ ఏర్పడ్డ పది ఏళ్ళల్లోనే రాష్ట్రం మెరుపువేగంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. వ్యవసాయ విస్తీర్ణాన్ని పెంచామని, రైతులకు రూ.61 వేల కరెంట్ సబ్సిడీ ఇచ్చామని, మొత్తంగా రైతులకు తాము పెట్టిన ఖర్చు రూ.1,84,525 కోట్లన్నా రు. స్వయం సమృద్ధి ఉన్న రాష్ట్రాన్ని తాము మీ చేతిలో పెట్టామని, బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద నోట్ల రద్దు, కరోనా లాంటి పరిస్థితులు రావడంతో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు జీతాలు ఆలస్యం చేసి రైతులకు ఆదుకున్నామన్నారు.
లేని అప్పులను ఉన్నట్లు చూపెడుతున్నారని, రాష్ట్రం ఏర్పడినప్పుడు జీడీపీ 2.82 శాతం ఉంటే ఇప్పుడు 5.1 శాతం ఉందని అన్నారు. 2025లో కూడా తెలంగాణ మిగులు రాష్ట్రమేనని అన్నారు. అప్పులు, వడ్డీలకు కడుతున్న అప్పు రూ.2,755 కోట్లు మాత్రమేనన్నారు. దేశంలోనే బెస్ట్ డెట్ మేనేజ్‌మెంట్ రాష్ట్రాల్లో తెలంగాణ రెండోదని నివే దికలు చెబుతున్నాయని పేర్కొన్నారు. తాము సంవత్సరానికి అప్పు చేసింది రూ.41 వేల కోట్లు మాత్రమేనని, కానీ కాంగ్రెస్ ఏడాదిలో నే 1.59 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు.
తాము అధికారంలో ఉండగా చేసిన అప్పు.. రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పెంచేందుకు, రైతు ఆత్మహత్యలను నివారణకు వారికి అనేక పథకాలు ప్రవేశపెట్టేందుకు ఉపయోగించామ ని, దాన్ని అప్పు.. అప్పు అని విమర్శించడం సరికాదని కేటీఆర్ అన్నారు. రాష్ట్రం దివాళా తీసిందని ప్రచారం చేయడం సబబు కాదని అన్నారు. అతి తక్కువ అప్పులు ఉన్న రాష్ట్రా ల్లో తెలంగాణ నాలుగవ స్థానంలో ఉందన్నా రు. తమ కంటే ఎక్కువ అప్పులు తెస్తున్నారని ప్రభుత్వాన్ని తప్పుపట్టడం లేదని, తెచ్చిన అప్పులతో సంపద సృష్టించాలని ఆయన కోరారు.
తెలంగాణ దివాళా రాష్ర్టం కాదని, తెలంగాణ దిగ్గజ రాష్ర్టంగా నిలిచిందని.. తెలంగాణ ఎప్పటికీ దిగ్గజ రాష్ట్రమేనని ఆయన చెప్పారు. ‘మా ప్రభుత్వంలో 11 బడ్జెట్‌లు, మీ ప్రభుత్వంలో 3 బడ్జెట్‌లు రామక్రిష్ణారావు పెట్టారని, మరి ఆర్ధిక శాఖ చీఫ్ సెక్రటరీగా రామకృష్ణారావును ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు’ అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని సిరిసిల్ల, కొడంగల్‌లో ఏదైన ఊరికి పోయి రుణమాఫీ నిధులు పూర్తి గా వచ్చాయా అని తెలుసుకుందామా అం టూ కేటీఆర్ ప్రభుత్వానికి సవాలు విసిరారు. ప్రజలు గోల్డ్ అని కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని, ఇప్ప డు రోల్డ్ గోల్డ్ అని తేలిపోయిందన్నారు.
దేశానికి 5.1 శాతం జీడీపీ తెలంగాణ రాష్ర్టం ఇస్తుంది
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని ఆయన విమర్శించారు. దేశానికి రాష్ట్రం 5.1శాతం జీడీ పీ ఇస్తోందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో బీహార్, ఢిల్లీ, ఏపీలకు ఎక్కువ నిధులు కేటాయించారని పేర్కొన్నారు. రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పు డు 50 కిలోలున్న తెలంగాణ 100 కిలోల బరువును ఎత్తుకున్నట్లుగా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కేంద్రం తెలంగాణకు విభజన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు.
కేసీఆర్ కాళేశ్వరం, నెట్టంపా డు, కల్వకుర్తి, భీమా, పాలమూరు రంగారెడ్డిలకు ప్రాధాన్యమిచ్చామని, యాదాద్రి పుణ్య క్షేత్రాన్ని కేసీఆర్ కట్టించారని పేర్కొన్నారు. ఏపీలో పోలవరం, కర్ణాటకకు అప్పర్ భద్ర, మధ్యప్రదేశ్‌లో కెన్‌బేట్వా ప్రాజెక్టులకు జాతీ య హోదా ఇచ్చారు, కాళేశ్వరానికి, పాలమూ రు రంగారెడ్డికి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.
పైగా తల్లిని చంపి బిడ్డను వేరుచేశారని మోదీ తెలంగాణ ఏర్పాటును అవహేళన చేశారన్నా రు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఒక్క కలం పోటుతో ఏపీలో కలిపారని, బయ్యారంలో మంచి ఐరన్ ఓర్ లేదని, అక్క డ ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి చెప్పారన్నారు. ఒక్క ఇండ్రస్ట్రీయల్ కారిడార్ తెలంగాణకు కేంద్రం ఇవ్వలేదని, కొత్త జిల్లాలకు నవోదయ స్కూల్స్, మెడికల్ కాలేజీలు ఇవ్వలేదని తెలిపారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఏపీకు రూ.11,500 కోట్ల ప్యాకేజీ ఇచ్చారన్నారు. గుజరాత్‌కు ఒక న్యాయం తెలంగాణ కు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. కేంద్రం లో ఉన్న ఇద్దరు మంత్రుల్లో ఒకరు సహాయ మంత్రి, ఇంకొకరు అసహాయ మంత్రి అని ఎద్దేవా చేశారు. యాదాద్రికి, వేములవాడకు, భద్రాచలం రాములవారికి, కొమురవెల్లి మల్లన్నకు ఒక్క రూపాయి ఇచ్చారా? అని ప్రశ్నించారు.
వన్ ట్రిలియన్ ఎకానమీ ఎలా సాధ్యం..
వన్ ట్రిలియన్ ఎకానమీ ఎట్లా సాధిస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం తమకు చెప్పాలని కేటీఆర్ అన్నారు. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో ఇందిరమ్మ ఇళ్లకు ఎస్సీ, ఎస్టీలకు ఆరు లక్షలు ఇస్తా మని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. లాం డ్ క్రూజర్లు కొన్నారు విజయవాడలో దాచిపెట్టారని, ప్రగతిభవన్‌లో వంద రూములు ఉన్నాయని తమపై అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. తాము ఇచ్చిన ఉద్యోగాలకు ఇప్పుడు నియామక పత్రాలు ఇస్తున్నారని, తాము 6.50 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పారు.
చెన్నైలో సీఎంను గౌరవించాను..
‘రాష్ట్రంలో ఉప్పు నిప్పులా కొట్లాడుకుం టాం. కానీ చెన్నైలో సీఎం రేవంత్‌రెడ్డిని గౌరవించాను. అక్కడ మీరు ఒక ప్రతిపాదన పెడి తే.. నేను మీ పార్టీ వ్యక్తిని కాకున్నా మద్దతిచ్చా ను. మా సీఎం చెప్పిన మాట కరెక్టు 33 శాతం కాదు 36 శాతం ఇవ్వొచ్చు అని చెప్పాను. ఎం దుకంటే సరిహద్దులు దాటిన తర్వాత నిన్ను కాపాడాలి.. గౌరవించాలి.. అది నా బాధ్యత.. అది నా సంస్కారం’ అని కేటీఆర్ అన్నారు.
ఇక్కడ సభలో అంత ఫ్రస్టేషన్ ఉండి.. రంకెలు వేస్తామంటే.. ప్రతిపక్షాల మీద దాడి చేస్తామం టే కుదరదు. పరిపాలన అంటే పంచ్ డైలాగు లు కాదు.. మీరు చెప్పిన కష్టాలన్ని ఉంటాయి. 2014లో కూడా కష్టాలతోనే ప్రారంభించాం. అన్ని సెట్ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాం. మాపై కక్షసాధింపు లేదని అంటూనే బీఆర్‌ఎస్ పథకాలు, ప్రాజెక్టులను ఎందుకు రద్దు చేశారు. అప్పటికే ఎయిర్‌పోర్టుకు మెట్రో టెండర్ అయిపోయినా రద్దు చేశారు.
ఫార్మాసిటీలు వద్దన్నారు. ఇప్పుడు ఫార్మా విలేజ్‌లు ముద్దంటున్నారు. కొడంగల్‌లో జరిగిందేమి టీ? లగచర్లలో ఫార్మా విలేజ్ పెట్టాలనుకుం టే.. మీ సోదరుడో.. లేక మీ పార్టీ నాయకులో అక్కడి ప్రజలను ఒప్పించి ఉండాల్సింది. లగచర్ల రైతులు ధర్నాలు, రాస్తారోకోలు పట్టిం చుకోలేదు. అఖరికి అధికారులు పోతే లొల్లి అయింది. దాన్ని మాకు అంటగడితే ఎలా? మీరు పెట్టే కేసులకు భయపడం. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
మీ తిట్లే మాకు దీవెనలు, ఆశీర్వాదాలు..
మమ్ములను ఇంకా తిట్టాలనుకుంటే.. ఇంకో రెండు గంటలు తిట్లుకోండి.. నాకు ఇబ్బందేమి లేదు. మీ తిట్లన్ని మాకు దీవేలు, ఆశీర్వాదాలు. మీరు ఎంత మాట్లాడితే మా కు అంత మంచిది’ అని కేటీఆర్ అన్నారు. సీఎం పదవీలోకి వచ్చాక కూడా రేవంత్‌రెడ్డికి ఇంత ఫ్రస్టేషనా.. నా రాజకీయ జీవితం లో నేను ఇప్పటీవరకు ఇలాంటి సీఎంను చూడలేదు. మీ ఉక్రోషం వల్ల వచ్చే 20 ఏళ్లు కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేయాలంటే భయపడే పరిస్థితి తెలంగాణలో వచ్చింది.
మహా రాష్ట్ర, ఢిల్లీ, హర్యానా ఎన్నికల్లో ప్రచారం చేసి అద్భుతాలు సాధించారు!. ఇటీవల రాష్టంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ప్రచారం చేశారు. 57 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు. కానీ, ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు ఓట్లు వేయలేదు. రంకెలతో ఏమీ రాదు.. ప్రతిపక్షాల మీద దాడి చేస్తే ఏం కాదు. మీరు అధికారంలోకి వచ్చాక పెద్దవాగు రెండుసార్లు కొట్టుకుపోయింది. సుంకిశాల కూలిపోయింది. భక్తరా మదాసు మోటార్లు మునిగిపోయినాయి’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ జాతిపిత కేసీఆరే..
‘ఎవరు ఏమనుకున్నాసరే.. తెలంగాణ జాతిపిత కేసీఆరే.. బూతుపిత రేవంత్‌రెడ్డినే. ఆయన బూతుపితగానే మిగిలిపోతారు.. ఆయన ఓ అపరిచితు డు’. కేటీఆర్ విమర్శించారు. ‘సీఎం రేవంత్‌రెడ్డికి ఎవరో ఏకే 47 గురించి చెప్పారు. ఏకే 47తో పాటు తుపాకుల గురించి ఆయనకు తెలిసినంత మాకు తెలియదు. తెలంగాణ ఉద్యమంలో ప్రజల మీదకు తుపాకి తీసుకుపోయిన రైఫిల్‌రెడ్డి ఆయన.
అసలు ఎవరు ఎవ ర్ని చంపి అధికారకం లాక్కున్నారు? పాపం పాత కాంగెస్ నేతలందరిని ఖతం చేసి రేవంత్‌రెడ్డినే పదవి లాక్కుకుని మమ్మల్ని అంటే ఎలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రైజిం గ్ అనే అట్టర్ ప్లాప్ సినిమాకు శత దినోత్సవం చేసినట్లు విఫల పాలనకు విజయోత్సవాలు నిర్వహించారు. ఏడాదిలో ఆరు గ్యారెంటీలు, తులం బంగా రం, రుణమాఫీ, రైతుబంధు ఇచ్చారా? అప్పు లు, అబద్దాలు, క్రైమ్‌రేట్‌లో, నేతన్నలు, అన్నదాతల ఆత్మహత్యల్లో తెలంగాణ రైజింగ్’ అని కేటీఆర్ విమర్శించారు.
‘హైడ్రాతో పేదల మీద ప్రతాపం చూపుతూ పెద్దలను పట్టించుకోవడం లేదు. రియల్ ఎస్టేట్ కుప్పకూ లింది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గింది. రాష్ట్రం నుంచి మూడు కంపెనీ లు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. రెండు జాతీయ పార్టీలు తెలంగాణపై సవితి తల్లి ప్రేమను చూపిస్తున్నారు’ అని అన్నారు.
కాంగ్రెస్ పాలన ఓ స్త్రీ రేపురా అన్నట్లుగా ఉంది..
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ‘ఓ స్త్రీ రేపు రా’ అన్నట్లుగా ఉందని కేటీఆర్ ఆరోపించారు. ‘తెల్లారి లేస్తే ప్రజాపాలన అంటా రు, కానీ నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో.. మీ ప్రజాపాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి అంతే ఉంది. ఇది ప్రజాపాలన కాదు, ప్రజా పీడన. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటున్నారు. కానీ అత్తా కోడళ్లకు పంచాయతీ పెట్టారు. తులం బంగారం లంకె బిందెలు దొరికిన తర్వాత ఇస్తారా..?. ఆసరా పెన్షన్ల కోసం గొడవలు జరుగుతున్నాయి.
మహిళలను కోటీశ్వరులను ఎలా చేస్తారో తెలియదు. రూ.2,500 కోసం ఆడబిడ్డలను ఎదురుచూస్తున్నారు. కేటీఆర్ కిట్, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాలు లేవు.. ఆశాలు, అంగన్‌వాడీ కార్మిలను మోసం చేశారు. ఉద్యోగుల డీఏ, పీఆర్సీలు, ఐఆర్ పెండింగ్‌లోనే. వ్యవసాయ విస్తరణ అధికారుల ను, పోలీసులను సస్పెండ్ చేశారు. ప్రజా పాలన అంటే ఇలా ఉంది’ కేటీఆర్ విమర్శించారు.
కొట్లాడుదాం..
తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూపాయి వెళ్తే అందులో తిరిగి మనకు వచ్చేది 42 పైసలు మాత్రమేనన్నారు. కేంద్రం మనకు ఏనాడు ఏమీ ఇవ్వలేదని, కేంద్ర బడ్జెట్‌లోనూ మనకు గుండుసున్నా ఇచ్చారని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి తాము కలిసి వస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై రాష్ర్ట బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావన చేయలేదని విమర్శించారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్.. ‘కేం ద్రం మిధ్య’అని అన్నారని, నాడు ఎన్టీఆర్ చెప్పింది నిజమేనని అనిపిస్తుందన్నారు.
కేంద్రం తెలంగాణకు వచ్చేసరికి మిధ్యలాగా వ్యవహరిస్తోందని విమర్శించారు. డబుల్ ఇంజన్ అంటే రాష్ర్టంలో తమ ప్రభుత్వం ఉంటేనే నిధులు ఇస్తామని కేంద్రం ఆంటోందని, కేంద్రం ఒక రకంగా రాష్ట్రాలను బ్లాక్ మెయిల్ చేయడంలాంటిదేనన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మా కు వచ్చింది సున్నా సీట్లు నిజమే.. కాం గ్రెస్, బీజేపీకి చెరో ఎనిమిది సీట్లు వచ్చాయని, కానీ కేంద్రం తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా అన్నారు.
కేంద్రంపై కొట్లాడాల్సిందేనని, కేంద్రంపై పోరాటంలో తాము కలిసివస్తామని కేటీఆర్ చెప్పారు. కేంద్రంతో తాము సఖ్యతతోనే ఉన్నామని, సఖ్యతగా ఉంటే తెలంగాణకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. నాడు మిషన్ భగీరథ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పీఎం మోదీని పిలిచామన్నారు. మిషన్ భగీరథ, రైతుబంధు లాంటి తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొట్టిందన్నారు. కేంద్ర మంత్రులు తెలంగాణకు దండయాత్రగా వస్తారని, వాళ్ల పర్యటనలకు అయ్యే ఖర్చులు తెలంగాణలో ఒక ప్రాజెక్టు పూర్తి చేయొచ్చన్నారు.
అందాల పోటీలు ఆపి..
రాష్ట్రంలో అందాల పోటీలు ఆపేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వండి.. రూ 500 కోట్లు పెడితే కొందరికైనా స్కూటీ లు వస్తాయని కేటీఆర్ డిమాండ్ చేశా రు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయడం లేదన్నారు. ‘విద్యా శాఖ కు 15 శాతం నిధులు కేటాయిస్తామని 7.5 శాతమే కేటాయించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కంటే ముందు గురుకుల పాఠశాలలను కాపాడాలి. అద్దెలు చెల్లించకపో వడంతో గురుకులాలు మూతపడుతున్నా యి.
విదేశీ విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 8 వేల కోట్ల వరకు ఉన్న బకాయిలను చెల్లించాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చా క కేవలం 11 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. మేం నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించిన వాటికే కాగితాలు ఇచ్చారు. గ్రూప్ పోస్టులు పెంచుతామని, గ్రూ ప్‌ఝూ|2 పోస్టులు 2 వేలు వేస్తామని వేయలేదు. 20 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్న హామీని మర్చారు. జీవో 29 తెచ్చి బలహీన వర్గాల నోట్లో మట్టి కొట్టా రు’ అని విమర్శించారు.