calender_icon.png 20 January, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2028 ఒలింపిక్స్‌పై చర్చ: ద్రవిడ్

30-07-2024 12:33:16 AM

పారిస్: లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టే నిర్ణ యాన్ని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వాగతించాడు. టీ20 ప్రపంచకప్ సంద ర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లంతా 2028 ఒలింపిక్స్‌పై చర్చించుకున్నారని తెలిపాడు. పారిస్ ఒలింపిక్స్‌కు హాజరైన ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆడిం చాలనే నిర్ణయం చారిత్రాత్మకం. నేను కోచ్‌గా ఉన్న సమ యంలో ఒలింపిక్స్‌లో ఆడడంపై డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లు సంభాషించుకున్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు క్రికెటర్లు ఉత్సుకతతో ఎదురుచూ స్తున్నారు’ అని తెలిపాడు. ఇక ఒలింపిక్స్‌లో ద్రవిడ్.. బోపన్న బాలాజీ మ్యాచ్‌తో పాటు భారత్, అర్జెంటీనా మధ్య జరిగిన హాకీ మ్యాచ్‌ను వీక్షించాడు.