26-03-2025 12:08:23 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Session) బుధవారం కొనసాగుతున్నాయి. ధరణి, భూ భారతిపై బీఆర్ఎస్, కాంగ్రెస్(BRS Vs Congress) సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిచిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ ను రద్దు చేసిన భూ భారతి చట్టాన్ని తెచ్చింది. నేడు సభలో భూ భారతిపై వాడీవేడీగా చర్చ జరుగుతోంది. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) వ్యాఖ్యాలపై మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. భవిష్యత్తులో భూ భారతి(Bhu Bharati)పైనే ఎన్నికలకు వెళ్తామన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి.. అసత్యాన్ని సత్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే వారిని ప్రజలు ఓడించారని స్పష్టం చేశారు. భూ భారతిపై కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తే.. మేము కూడా ధరణిపైనే ఎన్నికలకు పోతామని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) తెచ్చింది భూ భారతి కాదు.. భూ హారతి అన్నారు. జమాబంది పేరుతో మరో దుకాణం తెరిచిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడు జమాబందిఎందుకో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) ఎదురుదాడి చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయుధ పోరాట స్ఫూర్తితోనే కాంగ్రెస్ భూములపై హక్కులు కల్పిస్తూ వస్తోందని భట్టి విక్రమార్క వివరించారు. దున్నేవాడిదే భూమి కదా.. సాయుధ పోరాట(Armed struggle) నినాదం అన్నారు. ఒక్క కులం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టమే ధరణి అన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం.. బంగాళాఖాతంలో వేశాం.. కొత్త చట్టం తెచ్చామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత పదేళ్లలో అనేక చట్టాలు, పోరాటాల ద్వారా వచ్చిన హక్కులను కాలరాశారని ఆరోపించారు. ధరణిని బంగాళాఖాతంలో వేయాలనే ప్రజలు మాకు అధికారం కట్టబెట్టారని ఉపముఖ్యమంత్రి చెప్పారు.