10-04-2025 02:28:10 AM
శాంటోడొమింగో, ఏప్రిల్ 9: డొమినికన్ రిపబ్లిక్ దేశపు రాజధాని శాంటోడొమింగో లో నైట్ క్లబ్ కూలి దాదాపు 1౨౪ మంది మృత్యువాతపడ్డట్లు అధికారులు తెలిపారు. బాధితుల్లో ఒక ప్రావిన్షియల్ గవర్నర్, మేజ ర్ లీగ్ బేస్‌బాల్ మాజీ పిచర్ కూడా ఉన్నా రు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
అక్కడున్న ఓ నైట్ క్లబ్‌లో ప్రసిద్ధ మెరెంగ్ గాయకుడు రూబీ పెరెజ్ ప్రదర్శన సమయంలో ఈ ప్రమాదం సంభ వించింది. మంది సహాయ సిబ్బంది వారి కోసం గాలిస్తున్నారు. శిథి లాల కింద చిక్కుకున్న అనేక మంది ప్రాణా లతో ఉంటారని ఆశిస్తున్నట్లు ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ (సీవోఈ) డైరెక్టర్ జాన్ మాన్యుయెల్ ఆశాభావం వ్యక్తం చేశారు.