calender_icon.png 1 April, 2025 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మయన్మార్-బ్యాంకాక్ భూకంపం.. ఆగని మృత్యుఘోష

30-03-2025 10:02:42 AM

మయన్మార్ భూకంపం ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య .. 

నేపిడా: మయన్మార్ భూకంపం(Myanmar earthquake) ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. రాత్రి వరకు 1,644 మంది చనిపోయినట్లు సైనిక ప్రభుత్వం వెల్లడించింది. మరో 3408 మంది గాయపడ్డారని మయన్మార్ సైనిక ప్రభుత్వం(Myanmar Military Government) ప్రకటించింది. 139 మంది ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం విపత్తు నిర్వహణ బృందాలు గాలిస్తున్నాయి. రెండు భారీ భూకంపాల ధాటికి వందలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. శిథిలాల తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు వెలుగుచూస్తున్నాయి.

మయన్మార్ లో రెండో అతిపెద్ద నగరం మాండలేలో భారీగా ప్రజలు మృత్యువాత పడ్డారు. మాండలే, నేపిడాలో సహాయ చర్యల్లో స్థానికులతోపాటు విదేశీ బృందాలు పాల్గొన్నాయి. ఐక్యరాజ్యసమితితో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల సహాయ చర్యలు చేపట్టాయి. మయన్మార్ లో సైనిక పాలన, భూకంప దృష్ట్యా తాత్కాలిక కాల్పుల విరమణ జరిగింది. మయన్మార్, థాయిలాండ్‌లను కుదిపేసిన భారీ భూకంపంలో ఆదివారం బ్యాంకాక్‌లో మరణించిన వారి సంఖ్య 17కి పెరిగిందని నగర అధికారులు తెలిపారు. 32 మంది గాయపడ్డారని, 83 మంది ఇంకా తెలియలేదని బ్యాంకాక్ మెట్రోపాలిటన్ అథారిటీ తెలిపింది. శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం సమయంలో కూలిపోయిన నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల టవర్ బ్లాక్ స్థలం నుండి వీరిలో ఎక్కువ మంది మరణించారు. ప్రస్తుతం థాయ్ లాండ్ లోనూ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్య కోసం వందలాది మంది రక్షకులు, భారీ క్రేన్‌లను మోహరించినట్లు అధికారులు తెలిపారు.