ప్రమాదానికి టీ అమ్ముకునే వ్యక్తే కారణం?
ముంబై, జనవరి 23: మహారాష్ట్రలోని జల్‌గావ్ రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 13కు చేరింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు రూ.1.5లక్షల ఎక్స్‌గ్రేషియాను రైల్వేశాఖ ప్రకటించింది.
తీవ్రం గా గాయపడిన వారికి రూ.50వేలు అందించనున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే రైలు ప్రమాదానికి టీ అమ్ముకునే వ్యక్తి వదంతులే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
రైలు లో మంటలు వ్యాపించాయని టీ అమ్మే వ్యక్తి చెప్పడంతో ప్రయాణికులు భయందోళనలకు గురైనట్టు పేర్కొన్నారు. కాగా బుధవారం ముంబై నుంచి లక్నోకు ప్రయాణిస్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వ్యాపించాయని ప్రయా ణికులు చైన్‌లాగి పక్కన ఉన్న పట్టాలకు దూకగా.. ఆ పట్టాలపై నుంచి వెళ్తున్న మరో రైలు వారిని ఢీ కొట్టింది.