calender_icon.png 25 November, 2024 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

17కు చేరిన మరణాల సంఖ్య

25-11-2024 01:36:58 AM

యూపీలోని మెడికల్ కాలేజీలో మరో ఇద్దరు శిశువుల మృతి

ఝాన్సీ, నవంబర్ 24: ఉత్తరప్రదేశ్‌లోని మహారాణి లక్ష్మిబాయ్ మెడికల్ కాలేజీ అగ్నిప్రమాదం ఘటన కేసులో మరణించిన చిన్నారుల సంఖ్య 17కు చేరింది. అగ్నిప్రమాదం నుంచి 39 మంది నవజాత శిశువులను రక్షించగా వారిలో ఇద్దరు చిన్నారులు అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు.

ఈ విషయాన్ని కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ నరేంద్ర సింగ్ సెంగా ర్ తాజాగా ఓ ప్రకటనలో తెలియజేశారు. మృతి చెందిన శిశువుల బరువు కేవలం 800 గ్రామలు మాత్రమే ఉన్నట్టు పేర్కొన్నారు. మరణించిన శిశువుల్లో ఒకరికి హృదయ సంబంధ సమస్య ఉన్నట్టు తెలిపారు. 

పోస్ట్‌మార్టం అనంతరం శిశువుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు వెల్లడించారు. కాగా, మెడికల్ కాలేజీలో ఈ నెల 15న అగ్నిప్రమాదం చోటు చేసుకోగా ఆ దుర్ఘటనలో దాదాపు 10 మంది శిశువులు సజీవ దహనమైన విషయం తెలిసిందే.