- గంట గంటకూ పెరుగుతున్న మరణాలు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
అడిస్ అబాబా, జూలై 24: దక్షిణ ఇథియోపియాలోని గోఫా జోన్‌లో కొండ చరి యలు విరిగిపడిన ఘటనలో మృతుల సం ఖ్య 229కి చేరినట్లు అధికారులు ప్రకటించారు. కొండచరియల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీస్తుట్లు గోఫా జోన్ విపత్తు నిర్వహణ అధికారి మార్కోస్ మెలేసే వెల్లడించారు. సహాయక చర్యలకు సంబంధించిన దృశ్యాలను స్థానిక అధికార యం త్రాంగం షేర్ చేసింది. ప్రజలంతా గడ్డపారలు పట్టుకుని తవ్వుతున్నట్లు ఉంది. సహా యక చర్యలు చేపట్టేందుకు వచ్చిన వ్యక్తుల మీద కూడా కొండచరియలు విరిగిపడటం తో మృతుల సంఖ్య పెరిగిందని గోఫా జిల్లా అధికారి మిస్‌కిర్ తెలిపారు. ఘటన తనను చాలా దిగ్బ్రాంతికి గురి చేసిందని ప్రధాని అబి అహ్మద్ విచారం వ్యక్తం చేశారు.