11-04-2025 12:23:01 AM
డొమినికన్ రిపబ్లిక్‌లో పైకప్పు కూలిన ఘటన
శాంటోడొమింగో: డొమినికన్ రిపబ్లికన్ దేశ రాజధాని శాంటో డొ మింగోలోని ఓ నైట్ క్లబ్ పైకప్పు కూలిన ఘటనలో మృతి చెందిన వా రి సంఖ్య 200 దాటింది. డొమినికన్ రిపబ్లిక్ అధికారులు సహాయక చర్యలను పూర్తి చేశారు. మంగళవారం తెల్లవారు జామున ఈ పైకప్పు కూలింది. ప్రసిద్ధ గాయకుడు రూబీపెరెజ్ ప్రదర్శన సందర్భంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
గాయకు డురూబీ పెరెజ్ కూడా మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఆయన మృతదేహాన్ని బుధవారం కనుగొన్నారు. ‘రెండు రోజులుగా రెస్క్యూ బృందాలు నిరంతరాయంగా సేవలందించాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చాయి.’ అని దేశ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ విభాగం ఎక్స్‌లో పేర్కొంది.