లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తామంటూ ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు బెదిరింపు సందేశం అందింది. దీంతో భద్రతా దళాలు హై అలర్ట్ అయ్యాయి. ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్‌కు ఓ వ్యక్తి గుర్తు తెలియని నంబర్ నుండి ఫోన్ చేసి, యోగి ఆదిత్యనాథ్ 10 రోజుల్లో రాజీనామా చేయకపోతే, అతను ఎన్‌సిపి నాయకుడు బాబా సిద్ధిఖీలాగా చంపుతామంటూ బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం బెదిరింపు సందేశం వచ్చిన తరువాత, ముంబై పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు వెనుక ఉన్న గుర్తు తెలియని వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ మధ్య కాలంగా బెదిరింపు కాల్స్ ఎక్కువ అయ్యాయి. ఇటీవల బాలీవుడ్ ప్రముఖు హీరో సల్మాన్ ఖాన్ పై కూడా పోలీసులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి.