25-02-2025 08:25:17 PM
కొండాపూర్: కొండాపూర్ మండలంలోని మల్లెపల్లి గ్రామ శివారులో ఉన్న యూబీ గోల్కొండ పరిశ్రమంలో కార్మికుడు రాములు అనుమానాస్పదంగా మరణించాడు. మంగళవారం కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే కార్మికుడు మృతి చెందాడని ఆరోపిస్తూ పరిశ్రమ ముందు ఆందోళనకు దిగారు. యాక్సిడెంట్ లో కార్మికుడు మరణించినట్లు యాజమాన్యం తెలిపిందని కార్మికులు ఆరోపించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కొండాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.