ఎర్ర జెండా కప్పి నివాళులర్పించిన సీపీఐ నాయకులు.
మనకొండూర్, (విజయక్రాంతి) : చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన ఆర్టీసీ కండక్టర్, సిపిఐ కార్యకర్త రాకం లింగమూర్తి అకాల మరణం తీరనిలోటని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, మాజీ జడ్పీటీసీ అందెస్వామి, మండల కార్యదర్శి నాగేళ్లి లక్ష్మారెడ్డిలు పేర్కొన్నారు. ఆదివారం ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న లింగమూర్తి హఠాత్తుగా బిపి తక్కువై పల్స్ పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందారని, లింగమూర్తి భౌతిక కాయాన్ని చిగురుమామిడిలో ఆయన నివాసం వద్ద ఉంచగా సిపిఐ నాయకులు ఆయన మృతదేహంపై ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా స్వామి, లక్ష్మారెడ్డి మాట్లాడుతూ లింగమూర్తి మొదటి నుండి సిపిఐ సభ్యుడుగా కొనసాగుతూ గతంలో చిగురుమామిళ్ల గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా కూడా పోటీ చేశాడని ప్రజలకు సేవ చేయాలనే తపన ఉండేదని ఆర్టీసీ కండక్టర్ గా ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడని అయినప్పటికీ తన వారసత్వంగా తన భార్య రాగం అంజవ్వను అనేకసార్లు వార్డు సభ్యురాలుగా పోటీ చేయించి గెలిపించారని, సీపీఐ పార్టీ సభ్యులుగా వారి కుటుంబం ఉందని, పార్టీ బలోపేతం కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చిన లింగమూర్తి మరణం సిపిఐ కి వారి కుటుంబానికి తీరనిలోటని వారి మృతి పట్ల సిపిఐ తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండదండలుగా ఉంటుందని స్వామి, లక్ష్మారెడ్డి తెలిపారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గూడెం లక్ష్మి, కొయ్యడ సృజన్ కుమార్, గడిపె మల్లేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు బూడిద సదాశివ, అందె చిన్న స్వామి, ముద్రకొల రాజయ్య,మాజీ మండల కార్యదర్శి తేరాల సత్యనారాయణ, గ్రామ శాఖ కార్యదర్శి అల్లెపు జంపయ్య తదితరులు ఉన్నారు.