calender_icon.png 19 January, 2025 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోర్డింగ్ దించుతూ కూలీల దుర్మరణం

19-01-2025 01:26:07 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 18 (విజయక్రాంతి): హైదరాబాద్ హబ్సిగూడలో ఓ చిట్‌ఫండ్ కంపెనీకి సంబంధించిన హోర్డింగ్ దించే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. భవనం రెండో అంతస్తు నుంచి హోర్డింగ్‌ను దింపేందుకు ప్రయత్నించిన సమయంలో హోర్డింగ్ జారి అక్కడే ఉన్న విద్యత్ తీగలపై పడింది. దీంతో బాలు (37), మల్లేశ్ (29) విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.