- పెద్దాపూర్ ఘటనతో మంత్రి మండలి దిగ్భ్రాంతి
- విదేశీ పర్యటనలో ఉన్న సీఎం కూడా స్పందించారు
- మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఉద్యోగాలు
- గత ప్రభుత నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో దుస్థితి
- ప్రక్షాళనకు నిధులు మంజూరు చేస్తాం
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
జగిత్యాల, ఆగస్టు 13 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల విద్యార్థుల మృతి యావత్తు ప్రభుతాన్ని కలిచివేసిందని, విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి ఫోన్లో మాట్లాడారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంత్రి మండలి సభ్యులందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పారు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలను మంగళవారం భట్టి విక్రమార్క సందరించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై ఇద్దరు విద్యార్థుల మృతి, నలుగురు విద్యార్థుల అసస్థత కు గల కారణాలు తెలుసుకున్నారు. మృతిచెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా ఉంటామని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన మా ప్రభుతంపైనే ఉన్నదని, పరిస్థితి తెలుసుకోవడానికే నేరుగా పెద్దాపూర్ గురుకులానికి వచ్చానని ఆయన వెల్లడించారు. రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేస్తామని, వాటికి అవసరమైన నిధులను సమకూర్చుతామని స్పష్టం చేశారు. మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులకు గురుకులాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ర్ట వ్యాప్తంగా గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రపంచంతో పోటీపడే విద్యకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. గురుకులాల ప్రాంగణాలను శుభ్రంగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ర్ట చరిత్రలోనే ఎన్నడే లేనివిధంగా గురుకులాల పక్క భవనాలకు బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. అలాగే విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి పెద్దఎత్తున నిధులు కేటాయించామన్నారు.
హెల్త్ కార్డ్స్ విధానం తేవాలి
2004 నుంచి 2014 వరకు ప్రభుత హాస్టళ్లలో చదివే విద్యార్థులకు హెల్త్ కార్డ్స్ విధానం ఉండేదని డిప్యూటీ సీఎం భట్టి గుర్తు చేశారు. ప్రతినెల వైద్యులు వచ్చి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి కార్డులో రాసేవారని తెలిపారు. హాస్టల్లోనే పారా మెడికల్ సిబ్బంది ఉండేవారని చెప్పారు. తిరిగి ఆ విధానాన్ని తీసుకురావాలని గురుకులాల సెక్రటరీకి భట్టి సూచించారు. రాష్ర్టవ్యాప్తంగా ఉన్న ప్రతి గురుకులంలో అత్యవసర ఔషధాలు, పారామెడికల్ సిబ్బంది, కుక్క, పాముకాటుకు మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
నాణ్యత గల ఆహారం అందించా లని, శుచి శుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. హాస్టళ్లలోని ప్రతి విద్యార్థికి బెడ్, బెడ్ షీట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని గురుకులాల సెక్రటరీని ఆయన ఆదేశించారు. ఈ క్రమంలోనే పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు రూ.50లక్షలు మంజూరు చేశారు.
గురుకులాల భద్రతకు చర్యలు
ప్రతి గురుకుల పాఠశాలలో టాయిలెట్స్, సమృద్ధిగా నీరు విద్యుత్ సౌకర్యాలు కల్పించి, గురుకుల పాఠశాలల భద్రతకు చర్యలు తీసుకోవాలని గురుకులాల సెక్రటరీని భట్టి ఆదే శించారు. ఈజీఎస్ పనుల కింద గురుకుల పాఠశాలల్లో చెత్తా, చెదారం, పిచ్చి మొక్కలు తొలగించాలని, పండ్లు, ఔషధ మొక్కలు నాటించాలని చెప్పారు. గురుకులాల్లో పనిచేసే వార్డెన్లు, టీచర్లు, పారామెడికల్ సిబ్బంది స్థానికంగానే ఉండాలని ఆదేశించారు.
నెలలో ఒకరోజు గురుకులాల సందర్శన
ప్రతి నెలలో ఒక రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురుకుల పాఠశాలలను సందరించి, విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ప్రభుతం నిర్ణయించిందని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత ఆలోచనకు అనుగుణంగా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు నెలలో ఒకరోజు గురుకులాలను సందరించి విద్యార్థులతో భోజ నం చేసి వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. డిప్యూటీ సీఎం భట్టి వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ధర్మపురి, వేములవాడ, మానకొండూర్, చొప్ప దండి ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్, కవం సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కోరుట్ల ఎమ్మెల్యే కలకుంట్ల సంజయ్ కుమార్, కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువాడి నర్సింగరావు, కలెక్టర్ సత్యప్రసాద్ ఉన్నారు.
భవనాల నిర్మాణంలో బీఆర్‌ఎస్ నిర్లక్ష్యం
గత బీఆర్‌ఎస్ ప్రభుత నిర్లక్ష్యం ఫలితమే గురుకులాల్లో ఈ దుస్థితి నెలకొన్న దని, అరకొర వసతుల కల్పనకు కారణమని భట్టి విమర్శించారు. గురుకుల భవనాల నిర్మాణానికి నిర్లక్ష్యం వహించిందని విరుచుకుప డ్డారు. 2018 సంవ త్సరంలో గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.79 కోట్లు, 2019 20 వారి క సంవత్సరంలో రూ.70 కోట్లు, 2020 21 వారిక సంవత్సరంలో కేవలం రూ.11 కోట్లు మాత్రమే కేటాయించిందని తెలిపారు. 2021 రూ.9 కోట్లు, 2022 రూ.7 కోట్లు, 2023 లో రూ.3 కోట్లు మాత్రమే కేటాయించిందని ఆయన చెప్పారు. నిధుల కేటాయింపు విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుతం నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫలితంగానే నేడు గురుకుల పాఠశాలలకు ఈ దుస్థితి అని విమరించారు.
తమ ప్రభుత్వంలో ప్రపంచంతో పోటీపడే విద్యను అందించాలని విద్యకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని చెప్పారు. పెద్దాపూర్‌లో 12 ఎకరా ల్లో భవన నిర్మాణం కోసం 2020 21లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిధులు మం జూరు చేసి విడుదల చేయలేదని ఆరోపించారు. నిధులు రాకపోవ డంతో కాంట్రా క్టర్ అర్ధాంతరంగా పనులు ఆపివేశారని చెప్పారు. తమ ప్రభుత్వంలో కావల్సిసిన నిధులు ఇచ్చి, నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. పెద్దాపూర్ పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్‌ను డిప్యూటీ సీఎం ఆదేశించారు.