calender_icon.png 5 February, 2025 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పద స్థితిలో యువకుని మృతి

05-02-2025 04:39:26 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కర్నాల రైల్వే లైన్ పై బుధవారం ఉదయం చంద్రవెల్లి గ్రామానికి చెందిన నంది నరేష్ (30) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు నరేష్ కొంతకాలం ఆటో డ్రైవర్ గా పని చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సెంట్రింగ్ పని చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. రైలు పట్టాలపై నరేష్ మృతదేహం పడి ఉండడం, అతని ముఖం, చేతులకు మాత్రం తీవ్రమైన గాయాలు ఉండడంతో అతని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతునికి తల్లిదండ్రులు లేరని, గ్రామంలో ఒంటరిగానే నివసిస్తున్నాడని తెలుస్తుంది. ఈ మేరకు బెల్లంపల్లి జిఆర్పి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.