calender_icon.png 9 October, 2024 | 8:52 PM

గనిలో ఊపిరాడక కార్మికుడి మృతి

11-09-2024 02:41:33 AM

మంచిర్యాల, సెప్టెంబర్ 10 (విజయక్రాం తి): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా డివిజన్ పరిధిలోని ఇందారం ఖని(ఐకే) 1 ఏ గనిలో ఊపిరాడక కార్మికుడు మృతి చెందిన ఘటన మంగళవా రం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీనగర్‌కు చెందిన ఎనవేన శ్రీనివాస్(35) ఇందారంలోని ఐకే 1ఏ గని లో జనరల్ మజ్దూర్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం మొ దటి షిప్టులో అండర్ గ్రౌండ్‌లో పనిచేస్తుండగా పూర్తిగా గాలి ఆడకపోవడంతో అస్వసతకు గురై కు ప్పకూలిపోయాడు. గమనించిన తోటి కార్మికులు వెంటనే అధికారులకు స మాచారం అందించారు. పైకి తీసుకువచ్చి రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.

గనిలో వెంటిలేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల నే శ్రీని వాస్ మృతి చెందాడని పేర్కొంటూ కార్మికు లు ధర్నాకు దిగారు. యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవడంలేదన్నారు. యాజమాన్యమే బాధ్యత వహించాలని హెచ్‌ఎం ఎస్ కార్మిక సంఘం నాయకులు డి మాండ్ చేశారు. తన భర్త గనిలోనే ఊపిరాడక చనిపోతే సింగరేణి అధికారులు బతికి ఉన్నట్లు గా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు నాటకమాడారని శ్రీనివాస్ భార్య అనిత వాపోయి ంది. అధికారులపై చర్యలు తీసుకోవాలని, త నకు న్యాయం చేయాలని కోరింది. ఈ మేర కు జైపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.