11-03-2025 08:39:54 PM
కామారెడ్డి (విజయక్రాంతి): పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామరెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. గర్గుల్ గ్రామానికి చెందిన శరత్ (16) గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శరత్ దూలానికి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే శరత్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.