calender_icon.png 11 January, 2025 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దూసుకొచ్చిన మృత్యువు

11-01-2025 01:17:52 AM

  1. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు
  2. ఒడిశాకు చెందిన ఐదుగురు కూలీల దుర్మరణం
  3. మరో 19 మందికి గాయాలు
  4. సూర్యాపేట జిల్లా ఐలాపురంలో ఖమ్మం-హైదరాబాద్ రహదారిపై ఘటన ఫాంట్

సూర్యాపేట, జనవరి 10 (విజయక్రాంతి)/సూర్యాపేట: ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఖమ్మం-హైదరాబాద్ రహదారిపై సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం ఐలాపురం గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జరిగింది.

ఒడిశా రాష్ట్రానికి చెందిన 32 మంది భవన నిర్మాణ కార్మికులు చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన గుప్తా ప్రైవేట్ ట్రావెల్ బస్సులో హైదరాబాద్‌కు పనుల నిమిత్తం బయలుదేరారు. చివ్వెంల మండలం ఐలాపురం గ్రామ శివారున ఇసుక లోడ్‌తో ఉన్న ఓ లారీ టైరు పేలిపోవడంతో రోడ్డు పక్కన నిలిపారు. ట్రావెల్ బస్సును డ్రైవర్ వేగంగా నడపడంతో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు.

బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ గోర్డా సునీల్ (37)తో పాటు రూపు హరిజన్(51), సుల హరిజన్(46), సునమని హరిజన్(61)  మృతి చెందారు. ఐదుగురికి తీవ్రగాయాలు కాగా 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీస్‌లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

తీవ్రంగా గాయపడిన వారిలో ప్రత్యూష్ ప్రభాత్ హరిజన్ అలియాస్ రోహిత్ (17) చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగిలిన నలుగురిని హైదరాబాద్‌కు తరలించారు. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకున్నారు. డ్రైవర్ నిద్రమత్తుతో పాటు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తున్నది. 

డీసీఎం, కారు ఢీకొని దంపతుల మృతి

జనగామ, జనవరి 10 (విజయక్రాంతి): డీసీఎం, కారు ఢీకొని దంపతులు మృతిచెందిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో జరిగింది. సూర్యాపేట జిల్లా ఈటూరు గ్రామానికి చెందిన పేరాల వెంకన్న(45), జ్యోతి (35) దంపతులు గురువారం రాత్రి జనగామ జిల్లాకు బయల్దేరారు.

జిల్లాలోని దేవరుప్పుల మండలం కడవెండికి కారు లో వస్తున్నారు. సూర్యా  - జనగా మ హైవేపై వేగంగా వెళ్తున్న కారు కొడకండ్ల మండలం మైథంచెరువు తండా పరిధిలో ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొట్టింది. దీంతో వెంకన్న, జ్యోతి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురి కి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. 

జడ్చర్లలో ఘోర ప్రమాదం

ప్రైవేటు బస్సు, లారీ ఢీకొని నలుగురు దుర్మరణం

మహబూబ్‌నగర్, జనవరి 10 (విజయక్రాంతి): హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న జేబీటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం భూరెడ్డిపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. రోడ్డుపై వెళ్తున్న కారు టైరు పేలడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. అది చూసి లారీ డ్రైవర్ ఒక్కసా రిగా బ్రేక్ వేయడంతో ఆ వెనకాల వస్తు న్న బస్సు లారీని ఢీకొంది. ఈ ప్రమా దంలో నలుగురు మృతిచెందగా, పలువు రికి గాయాలయ్యాయి.