calender_icon.png 23 January, 2025 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాన్న వెంటే మృత్యువు ఒడికి..!

26-08-2024 03:25:31 AM

  1. తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడికి గుండెపోటు 
  2. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతి 
  3. నిర్మల్ పట్టణంలో విషాదం

నిర్మల్ ఆగస్టు 15 (విజయక్రాంతి): తండ్రి పరిస్థితి విషమించి ఉదయం మృతిచెందాడు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని కుమారుడు గంటల వ్యవధిలోనే గుండెపోటుకు గురై ప్రాణాలొదిలాడు. ఒకరోజు ఇద్దరు మృతిచెందడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగింది. ఈ విషాదకరమైన ఘటన నిర్మల్ పట్టణంలో చోటుచేసుకున్నది. తెలిసిన వివరాల ప్రకారం.. నిర్మల్‌లోని ఆస్రా కాలనీలో నివాసం ఉంటున్న విశ్రాంత ఉద్యోగి జహుర్ అలీఖాన్ (73) కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆదివారం ఉదయం పరిస్థితి విషమించి ఆయన మృతిచెందారు.

దీంతో అబీద్ అలీఖాన్ (52) తన బంధువులకు కాల్ చేసి తండ్రి కాలం చేశాడని చెప్తున్నాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి అబీద్ అలీఖాన్‌కు గుండెపోటు వచ్చి కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే అబీద్ అలీఖాన్ మృతిచెందినట్లు నిర్ధారించారు. గంటల వ్యవధిలో తండ్రీకుమారులు మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదం న నెలకొన్నది. కుటుంబం సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడం చూపరులను కన్నీరు పెట్టించింది. కాగా, అబీద్ అలీఖాన్‌కు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.