calender_icon.png 3 April, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొమ్మనపల్లిలో ఘనంగా శ్రీ మహారాజ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి

02-04-2025 04:25:31 PM

టేకులపల్లి (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మహారాజ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ  సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. బొమ్మనపల్లి గ్రామంలో గల గౌడ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ కంఠ  మహేశ్వర స్వామి దేవాలయం వద్ద గల శ్రీ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గౌడ సంఘం అధ్యక్షులు బుర్ర ధర్మయ్య గౌడ్, కుల సంఘం నాయకులు పాల్గొన్నారు.