02-04-2025 10:22:43 PM
కొండపాక: భారతీయ జనతా పార్టీ కుకునూరుపల్లి మండల అధ్యక్షుడు అనుముల సంపత్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాకూరి కుమారస్వామిల ఆధ్వర్యంలో బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. 17వ శతాబ్దంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు పోరాటం చేసిన బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా ఓబీసీ మోర్చా జనరల్ సెక్రెటరీ కృష్ణమూర్తి, సిద్దిపేట జిల్లా కౌన్సిల్ మెంబర్ కృష్ణ, మండల పార్టీ జనరల్ సెక్రటరీ స్వామి, ఉపాధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు.