14-04-2025 12:30:17 AM
కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): దివంగత మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతోపాటు నగరంలోని శ్రీపాదరావు విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించాయి. మొదట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి, నగరంలోని శ్రీపాదరావు విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు కటకం మృత్యుంజయం, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పురుమల్ల, శ్రీనివాస్ పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, మాజీ శాసనసభ్యులు ఆరెపల్లి మోహన్‌తో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళుర్పించారు నాగర్ కార్మిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అజాతశత్రువుగా పేరుపొందిన శ్రీపాదరావు చరిత్ర నేటి యువతకు ఆదర్శమని అన్నారు. ఎంతఎదిగిన అంతా ఒదిగి ఉండాలనే అటువంటి గొప్ప లక్షణాలు పుణికి పుచ్చుకున్న వ్యక్తి శ్రీపాద రావు అని, ఆయన మరణంతో మొదటిసారిగా తప్పు చేశామని భావన మావోయిస్టులలో కలిగించింద న్నారు.
శ్రీపాద రావు సర్పంచ్ స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి శాసనసభ స్పీకర్‌గా పలు పదవులు చేపట్టి పదవులకు వన్నెతెచ్చినారని, ఆయన మరణానంతరం తనయు డైన దుద్దిల్ల శ్రీధర్ బాబు అడుగుజాడల్లో నడుస్తూ పలువురి మన్నలను పొందుతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమాలలో నాయకులు ఎండి తాజ్, బానోతు శ్రావణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి ,మల్లికార్జున రాజేందర్, ఆకుల నరసయ్య, కోడూరి రవీందర్ గౌడ్, ముల్కల ప్రవీణ్, కామ్రెడ్డి రాంరెడ్డి, కర్ర రాజశేఖర్, కమరుద్దీన్,దన్నా సింగ్, బషీరుద్దీన్, మాసూమ్, కుర్ర పోచయ్య, హస్తపురం తిరుమల,సుదర్శన్, హస్త పురం రమేష్, బత్తుల రాజకుమార్, వంగల విద్యాసాగర్,నాగుల సతీష్, కల్వల రామచందర్, లాయిక్, మాదాసు శ్రీనివాస్,చింతల కిషన్,మూల జయపాల్, దండి రవీందర్, అబ్దుల్ బారి,గాలి అనిల్, జ్యోతి రెడ్డి, ములకల కవిత యొనా,నెల్లి నరేష్, షబానా మహమ్మద్ , జీడి రమేష్, రాచర్ల పద్మ, సికిందర్, యనమల మంజుల, గంగుల దిలీప్,పెద్ది గారి తిరుపతి, కుంభాల రాజకుమార్, ఎజ్రా, కొల గాని అనిల్,కరీం,ఇమామ్, లక్కిరెడ్డి కిరణ్,జీలకర్ర రమేష్, కట్టెకోల ప్రభాకర్ ,స్వప్న శ్రీ, పర్వత మల్లేశం, శ్రీరాముల రమేష్, ఇమ్రాన్, అక్బర్ పాల్గొన్నారు.